Sharmila: ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న షర్మిల.. ఏం జరిగిందంటే?

Sharmila: తెలంగాణలో వచ్చే ఏడాది రాష్ట్రస్థాయి ఎన్నికలు జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే రాబోయే తెలంగాణా ఎన్నికల్లో వైఎస్ షర్మిల సికిందరాబాద్ పార్లమెంటు స్ధానానికి పోటీచేయబోతున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. షర్మిల ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని పాలేరు నుండి అసెంబ్లీకి పోటీ చేయబోతున్నట్లు చాలాసార్లు ప్రకటించారు. అయితే అదంతా ఎప్పుడంటే వైఎస్సార్టీపీ అధినేతగా ఉన్నప్పుడు. కాగా తొందరలోనే తన పార్టీని షర్మిల కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ విలీనం నిజమే అయితే షర్మిల పోటీచేయబోయే నియోజకవర్గం కూడా మారిపోతుందని అంటున్నారు. పాలేరు నుండి అసెంబ్లీకి కాకుండా సికిందరాబాద్ నుండి ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పాలేరు నుండి పోటీచేయాలని అనుకుని అక్కడే పార్టీ ఆఫీసు కూడా నిర్మించుకుంటున్నారు. ఇప్పుడు ఆ నిర్మాణ పనులు బాగా నెమ్మదించాయని సమాచారం. అందుకు గల కారణం తాజా పరిణామాలే అని అంటున్నారు. సికింద్రాబాద్ ఎంపీగా పోటీచేసే పక్షంలో పాలేరులో ఆఫీసు అవసరం లేదని షర్మిలే అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

 

ఎందుకంటే కాంగ్రెస్ కు గాంధీ భవన్ ఉన్నపుడు ఇక ప్రత్యేకించి వేరే ఆఫీసు అవసరం లేదు. ఎంపీగా గెలిస్తే అప్పుడు సికింద్రాబాద్ లోనే సొంతంగా తనకు ఆపీసు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే పాలేరు ఆఫీసు నిర్మాణం జోరు తగ్గించారట. సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయటం కన్ఫామ్ అయితే వెంటనే ఇక్కడే ఒక ఆఫీసు ఏర్పాటు చేసుకోవాలి. ఆ చేసుకునేదేదో లోటస్ పాండ్ లోనే ఉన్న ఆపీసునే వాడుకోవచ్చని కూడా అనుకుంటున్నారట. అనగా సికింద్రాబాద్ ఎంపీ ఆఫీసుగానే లోటస్ పాండ్ లో ఇపుడున్న ఆఫీసును వాడుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి షర్మిల తరపున సీనియర్ కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు వ్యవహారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే వార్త తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా నడుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -