Star Comedians: ఈ స్టార్ కమెడియన్లు రాజకీయాల్లో కరివేపాకు అయ్యారని తెలుసా?

Star Comedians: సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు ఎంతో మంచి అవినాబావ సంబంధం ఉంది.ఎంతోమంది రాజకీయాలలోకి వచ్చి రాజకీయాలలో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే కొందరు కమెడియన్లు మాత్రం సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకొని రాజకీయాలలోకి వచ్చారు. అయితే రాజకీయాలలో వారికి పెద్దగా గుర్తింపు లేకపోవడంతో చివరికి కూరలో కరివేపాకుల వారి పరిస్థితి మారిపోయిందంటూ పలువురు కమెడియన్లపై కామెంట్స్ చేస్తున్నారు.

మరి ఆ కమెడియన్లు ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే సినీ ఇండస్ట్రీలో కమెడియన్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ ఆలీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈయన సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే రాజకీయాలలోకి వచ్చినటువంటి ఈయనకు ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా పదవి ఇచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో రాజకీయాలలో కొనసాగలేకపోయారు.

 

ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో కూడా ఈయన పెద్దగా అవకాశాలను అందుకోకపోగా మిత్ర ద్రోహి అనే ముద్ర కూడా వేసుకున్నారు.ఇక ఈయన బాటలోనే పోసాని కృష్ణ మురళి కూడా ఉన్నారు. ఈయన కూడా రచయితగా నిర్మాతగా నటుడిగా మంచి గుర్తింపు పొందారు. అయితే రాజకీయాలలోకి వచ్చిన తర్వాత అక్కడ సరిగ్గా గుర్తింపు రాలేదు అంతేకాకుండా మెగా బ్రదర్స్ పై విమర్శలు చేయడంతో సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి.

 

ఇక నటుడు పృథ్వీరాజ్ సైతం రాజకీయాలలోకి వచ్చారు. అయితే కొన్ని కారణాల వల్ల వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఈయన ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రస్తుతం జనసేన భజన చేస్తున్నారు. అయితే ఈ పార్టీలో కొనసాగిన ఈయనకు పెద్దగా ప్రయోజనం ఏమీ లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వీరందరూ కూడా రాజకీయాలలోకి వచ్చి ఎటు కాకుండా ఉండిపోయారనేది మాత్రం నిజమని తెలుస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -