Tea Bread: బ్రెడ్‌ టీ కలిపి తింటే ఈ సమస్యలు వస్తాయి.. ఏం చేయాలంటే!

Tea Bread: ఉదయం లేవగానే సాధారణంగా ప్రతి ఒక్కరూ అల్పాహారం తీసుకుంటారు. అయితే ఒకొక్కరు ఒక్కోలా అల్పాహారం తీసుకుంటారు. చాలామంది రోజువారీ అల్పాహారంలో టీ, బ్రెడ్‌ను చేర్చుకుంటారు. ముఖ్యంగా కళాశాలలు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ఉదయం వివిధ కార్యాలయాలకు వెళ్లేవారు హడావుడిగా టీ బ్రెడ్‌ తీసుకుని వెళ్లిపోతారు. అయితే.. నిత్యం ఈ ఫుడ్‌నే తీసుకుంటే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్‌ ఆరోగ్యానికి హానీ చేస్తుందట.

గుండెకు హానికరం..

బ్రెడ్‌లో ఉండే ప్రిజర్వేటివ్లు, రసాయనాలు గుండె రోగులకు చాలా హానికరం చేస్తాయి. అల్పాహారం కోసం టీతో బ్రెడ్‌ తింటే కొలెస్ట్రాల్, రక్తపోటు పెరుగుతుంది. బ్రెడ్‌ తినడం వల్ల గుండెపోటు, స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇందులో సోడియం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి గుండెకు హానికరం.

జీర్ణక్రియకు హాని..

ప్యాకెట్లలో ప్యాక్‌ చేసిన బ్రెడ్‌లో ప్రిజర్వేటివ్‌ లో అనేక హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం, రొట్టెను మైదా పిండితో తయారు చేస్తారు. మైదాలో ఫైటర్‌ లోపం ఉంటుంది. దీని కారణంగా బ్రెడ్‌ జీర్ణక్రియకు మంచిది కాదు. బ్రెడ్‌ మన జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. దీంతో పాటు ఎన్నో రకాల వ్యాధులు దరి చేరుతాయి.

ప్రేగులలో పూత..

ఉదయం లేవగానే బ్రెడ్‌ను టీతో కలిపి తినడంతో అల్సర్‌ వస్తుంది. బ్రెడ్‌ జీర్ణవ్యవస్థకు హానికరం. ఇంకా దీనిలో టీ కలిపితే ఎసీడీటీ సమస్యలు వచ్చి క్రమంగా ప్రేగులలో పూతలకి దారితీస్తుంది.

డయాబెటిస్‌లో ప్రమాదమే..

టీతో బ్రెడ్‌ తినడంతో రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. బ్రెడ్‌–టీలో ఉండే మూలకాలు ఇన్సులి¯Œ ను ప్రేరేపిస్తాయి. అలాంటి పరిస్థితిలో మధుమేహం ఉన్న రోగులకు బ్రెడ్‌ చాలా హానికరం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -