KCR: కేసీఆర్ తాయిలాలు మైనార్టీలను ఆకర్షించడం ఖాయమేనా?

KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగనున్న నేపథ్యంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ క్రమంలోనే ఎలాగైనా కేసీఆర్ ను గద్దె దించాలని కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పోటీ సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే కెసిఆర్ కూడా సరికొత్త రాజకీయ వ్యూహాలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈయన మైనార్టీలపై ఎక్కడలేని ప్రేమను చూపిస్తున్నారు.

తెలంగాణలో ఎక్కువగా మైనార్టీలు ఉండడంతో ఆ ఓట్లు పక్కన వెళ్లకుండా ఉండడం కోసం కేసీఆర్ మైనార్టీలకు వరాల మీద వరాలు ఇస్తున్నారు.వచ్చే ఎన్నికలలో పోటీ చాలా గట్టిగా ఉండడంతో ఒకటి రెండు ఓట్లతో కూడా తీర్పు మారిపోయే అవకాశాలు ఉన్నాయి ఇక తెలంగాణ వ్యాప్తంగా మైనారిటీలు అధికంగా ఉండడంతో వారిని టార్గెట్ చేస్తూ వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావాలని కేసిఆర్ సర్కార్ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది.

 

ఈ ప్రయత్నాలలో భాగంగానే మైనారిటిలకు నూరుశాతం సబ్సిడితో లక్షరూపాయల రుణాలను ఇవ్వటానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మైనారిటీలంటే ముస్లింలు, క్రిస్తియన్లు మాత్రమే కాదు. తెలంగాణాలో ఉంటున్న సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు కూడా ఉన్నారు. వీరు కూడా నూరు శాతం సబ్సిడీతో లక్ష రూపాయల రుణాలను పొందవచ్చు అని తెలిపారు.

 

డబ్బులు అవసరమైన వాళ్ళు ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. తెలంగాణా స్టేట్ క్రిస్తియన్, మైనారిటి ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించటానికి ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. ఇలా మైనార్టీలను తన ఆయుధంగా మార్చుకోవడం కోసమే కెసిఆర్ ఇలా మైనార్టీలకు ఎన్నో లాభాలను చేకూరుస్తూ సరికొత్త పథకాలను అమలులోకి తీసుకు వస్తున్నారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -