Salt-Wealth: ఉప్పు, సంపద మధ్య ఉన్న సంబంధం ఇదే.. ఈ తప్పులు చేయొద్దంటూ?

Salt-Wealth: మాములుగా ఉప్పును లక్ష్మిదేవి స్వరూపంగా భవిస్తారు. అందుకే ఉప్పుని తొక్కకూడదు. ఉప్పుని పారేయకూడదని చెబుతూ ఉంటారు. అంతేకాకుండా ఉప్పు ఆర్థిక సమస్యలను దూరం చేయడానికి, ఆర్థికంగా నిలదొక్కు కోవడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఉప్పును అరచేతిలో వేసుకోకూడదని మన చేతితో ఎదుటి వాళ్ళ చేతికి ఇవ్వడం కూడా మంచిది కాదని చెబుతూ ఉంటారు. అయితే చాలా మంది డబ్బులని బాగా సంపాదిస్తున్నప్పటికీ చేతిలో డబ్బు మిగలడం లేదు అని బాధ పడుతూ ఉంటారు.

సంపాదించినది సరిపోకపోగా అప్పులు చేయాల్సి వస్తోంది అని దిగులు చెందుతూ ఉంటారు. అయితే డబ్బులు బాగా ఖర్చు అయిపోతుంది అని బాధపడేవారు, జీతాలు వచ్చిన తర్వాత ఆ డబ్బులు అన్నింటినీ ఒక కాగితంలో చుట్టి ఒకరోజు రాత్రంతా కూడా ఆ డబ్బుని, ఉప్పు డబ్బాలో ఉంచండి మరుసటి రోజు ఉదయాన్నే తీసి ఖర్చు పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు పోతాయి. డబ్బులు అనవసరంగా వృథా అయిపోవు. రాత్రిపూట ఉప్పు అని అనకూడదు. లవణం అని అనాలి. అలాగే శుక్రవారం రోజు పొద్దున్నే గాజు గ్లాసులో కొద్దిగా ఉప్పు వేసి, ఈశాన్యం మూలన పెడితే ఆర్థిక కష్టాల నుండి బయటపడవచ్చు.

 

అదే విధంగా సిరిసంపదలు కలగాలంటే మంగళవారం నాడు, శుక్రవారం నాడు ఇంటికి వచ్చినటు వంటి ముత్తైదువులని చాప వేసి కూర్చోబెట్టి, మంచినీళ్లు ఇచ్చి, పసుపు కొమ్ములు, కుంకుమ, పండు, తాంబూలం ఇవ్వాలి. ఈ విధంగా మీరు పాటిస్తే సిరిసంపదలు కలుగుతాయి. సౌభాగ్యం మెండుగా ఉంటాయి. మీరు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలంటే, ఎర్రటి గుడ్డలో ఉప్పు వేసి ఇంటి గుమ్మం ముందు కట్టాలి. మరుసటి రోజు ఉదయం గుడ్డలో కట్టినటు వంటి ఉప్పు ఎవరు తొక్కని చోట వేసేయాలి. అలా చేస్తే సుఖ సంతోషాలు కలుగుతాయి. ఉప్పుని అసలు అరువు ఇవ్వకూడదు. అరువుతెచ్చుకోకూడదు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -