Star Hero Prabhas: స్టార్ హీరో ప్రభాస్ గురించి ఈ షాకింగ్ విషయం మీకు తెలుసా?

Star Hero Prabhas: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒక సినిమా ఇంకా పట్టాలెక్కక ముందే మరొక పాన్ ఇండియా సినీమాకు సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు ప్రభాస్. ఇది ఇలా ఉంటే ఇటీవలే ఆది పురుష్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ప్రేక్షకులు అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది.

ఇది ఇలా ఉంటే ప్రభాస్ నటించిన మరో సినిమా సలార్ విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సంక్రాంతి పండుగకు కల్కి సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఇలా కొన్ని నెలల గ్యాప్ తోనే ప్రభాస్ నటించిన రెండు పాన్ ఇండియా సినిమాలు విడుదల కాబోతున్నాయి. కాగా ప్రభాస్ కల్కి మూవీ తర్వాత మారుతి దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే సలార్, కల్కితో పాటు సమాంతరంగా నడుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఈ సినిమాకు ఇప్పటివరకు రాజా డీలక్స్ అనే పేరు వినిపించింది.

 

అయితే ఇప్పుడు టైటిల్ విషయంలో సరికొత్త పుకార్లు కూడా వస్తున్నాయి. రాయల్ – అంబాసిడర్ అనే టైటిల్‌ను కూడా మారుతి పరిశీలిస్తున్నారట. అయితే రాయల్ టైటిల్ మీదే మారుతి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కథా పరంగా ప్రభాస్ క్యారెక్టర్ కి ఒక వీక్నెస్ ఉంటుంది అని సినిమాలో మెయిన్ స్క్రీన్ ప్లే మొత్తం ఈ వీక్నెస్ మీద నడుస్తుందని అంటున్నారు. ఈ వీక్నెస్ వల్ల వచ్చే కామెడీ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే మూవీ మేకర్స్ స్పందించేంత వరకు వేచి చూడాల్సిందే..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -