Lakshmi: బీరువా విషయంలో ఇల చేస్తే లక్ష్మీదేవి వెళ్లిపోతుందా.. ఆ తప్పులు చేయొద్దంటూ?

Lakshmi: ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మానవ ధర్మం అన్నాడొక సినీ కవి. ఆ మాట అక్షరాలా నిజం. డబ్బు లేనిదే సృష్టిలో ఏ పనులు జరగవు. ఆరోగ్యాన్ని, అనుబంధాన్ని నిలబెట్టుకోవడానికి కూడా డబ్బు చాలా ఉపయోగపడుతుంది. అయితే అలాంటి డబ్బు నిలువ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే లక్ష్మీదేవి కటాక్షం లభించదు.

ధనాన్ని నిలువ చేసే బీరువాను ఇంట్లో పెట్టే విషయంలో కూడా వాస్తు శాస్త్రం నియమాలను విధించింది. ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఉత్తర వాయువ్యంలో బీరువా అని పెట్టి డబ్బులు నగలు ఆ బీరువాలో పెడుతుంటే ధనం పెరగడమే కాకుండా ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారని వాస్తు శాస్త్రం చెప్తుంది. వాయువ్యం చంద్రునిది చంద్రుడు ధన ప్రవాహానికి అధిపతి కనుక వాస్తు ప్రకారం ఆ దిశలో పెట్టమని చెప్తారు వాస్తు నిపుణులు.

 

ఉత్తరానికి బీరువా వెనుక భాగం చూసే విధంగా డబ్బులు నగలు పెడితే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. బీరువాలో పనికిరాని చెత్త ఉంచకూడదు కేవలం విలువైన డబ్బు, బంగారం, విలువైన పత్రాలు లాంటివి మాత్రమే ఉంచాలి. అలాగే బీరువా చుట్టూ చీపురుతో తుడకూడదు. తడి బట్టతో మాత్రమే బీరువా చుట్టుపక్కల ఉడ్చాలి. అలాగే బీరువా తలుపులు తీసి వేయటం మరిచిపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుందట కాబట్టి బీరువా తలుపులు తీసిన ప్రతిసారి కచ్చితంగా తలుపులు వేసి అప్పుడు మిగిలిన పని చేసుకోండి.

 

ఎట్టి పరిస్థితులలోనూ బీరువాని నైరుతి వైపు పెట్టకండి. అలా పెడితే బీరువాలో డబ్బులు, నగలు అసలు పెరగవని, జీవితంలో ఆర్థిక అభివృద్ధి ఉండదని వాస్తు నిపుణులు చెప్తున్నారు. బీరువాలో 5 పసుపు కొమ్ములు, 5 లక్ష్మీ గవ్వలు ఉంచడం వలన ధనం నిలువ ఉంటుంది అలాగే సంపాదన కూడా పెరుగుతుంది. డబ్బులు పెట్టుకునే బీరువా కూడా దేవుని మందిరం లాంటిదే దానిని సుచి, శుభ్రం లేకుండా తెరవటం, బీరువాలో ఉండే వస్తువులను అల్లకల్లోలంగా ఉంచడం చేయకండి. ఎంత నీటుగా బీరువాని సర్దుకుంటే లక్ష్మీదేవి అంత సంతోషిస్తుందని తెలుసుకోండి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -