Adi: సుమన్, ఉదయ్ కిరణ్ గురించి అవసరమా ఆది.. చిరుపై విమర్శలకు ఛాన్స్ ఇచ్చావంటూ?

Adi: సినీ ఇండస్ట్రీలో నటులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సీనియర్ హీరో సుమన్ అలాగే ఉదయ్ కిరణ్ ఇద్దరు కూడా కొన్ని కారణాలవల్ల వారి కెరియర్ ను కోల్పోయారు చిరంజీవితో సమానంగా సినిమాలలో నటిస్తున్నటువంటి సుమన్ ఒక్కసారిగా జైలు పాలు కావడంతో ఆయన కెరియర్ అంతటితో ఆగిపోయింది. ఇక స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి యంగ్ హీరో ఉదయ్ కిరణ్ కెరియర్ అమాంతరంగా ఫాల్డౌన్ కావడం ఆయన ఆత్మహత్య చేసుకోవడం మనకు తెలిసిందే.

ఇలా వీరిద్దరి గురించి ఎప్పుడు ప్రస్తావనకు వచ్చిన మెగా కుటుంబంపైనే విమర్శలు వస్తాయి. ఎందుకంటేవీరి ఎదుగుదలను అడ్డుకోవడానికి మెగా కుటుంబం అవకాశాలు లేకుండా అనవసరమైనటువంటి అబాండాలు వేశారనే వార్తలు అప్పట్లో భారీ స్థాయిలో వైరల్ అయ్యాయి. ఇప్పటికి కూడా ఎంతో మంది పరోక్షంగా వీరి కెరియర్ నాశనం అవ్వడానికి ఉదయ్ కిరణ్ చనిపోవడానికి మెగా కుటుంబమే కారణం అని చెబుతూ ఉంటారు.

 

ఇలా ఇద్దరు హీరోల కెరియర్ నాశనం అవ్వడానికి మెగా కుటుంబమే కారణమని ఎన్నోసార్లు మీడియాలో వార్తలు వచ్చిన ఎప్పుడు కూడా చిరంజీవి వీటిపై స్పందించలేదు తనపై వచ్చినటువంటి విమర్శలు అన్నింటిని మౌనంగా భరించారే తప్ప ఏ రోజు నోరు విప్పలేదు.అయితే మానిపోతున్న గాయం పై కారం చల్లినట్లు హైపర్ ఆది చిరంజీవి గొప్పతనాన్ని చెప్పాలన్న ఉద్దేశంతో చిరంజీవి ముందు మరోసారి ఉదయ్ కిరణ్ మరణం గురించి చెప్పడంతో ఇదంతా ఇప్పుడు అవసరమా ఆది అంటూ పెద్ద ఎత్తున నేటిజన్స్ విమర్శలు చేస్తున్నారు.

 

హైపర్ ఆది తాజాగా భోళాశంకర్ ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన పవన్ గురించి చిరు గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఈ గొప్పగా చెప్పే ప్రయత్నంలోనే ఉదయ్ కిరణ్ వ్యక్తిగత కారణాలవల్ల ఆత్మహత్య చేసుకుంటే మీడియా వాళ్ళు చిరంజీవి గారి వల్లే అంటూ వార్తలు రాశారు. అయినప్పటికీ ఆయన మీడియాను క్షమించారు అంటూ చిరు గొప్పదనాన్ని వివరించే సమక్షంలోనే ఆయన ముందు ఇలా ఉదయ్ కిరణ్ ప్రస్తావన తీసుకురావడంతో ఇది నిజంగానే పుండు పై కారం చల్లినట్టేనంటూ పలువురు ఆది పై విమర్శలు చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -