KCR: కేసీఆర్ సంచలన నిర్ణయాలు.. తెలంగాణ వాసులకు ఇంతకు మించి శుభవార్త ఉంటుందా?

KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ఆయన ఆలోచనలు, ఆయన వేసే అడుగులు ఎలా ఉంటాయన్నది చెప్పడం అంచనా వేయడం అన్నది ఆ పార్టీ నేతలకు కూడా చాలా కష్టం. కాగా 2018 ముందస్తు ఎన్నికల సమయంలో రైతు బంధు స్కీమ్‌ను ఎన్నికలకు ముందుగానే ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటికే ఒక విడత రైతు బంధు ఇచ్చి రెండో విడత ఖచ్చితంగా ఎన్నికల సమయంలో అదీ కూడా ఓటింగ్ జరగడానికి ముందుగా రైతుల చేతికి చెక్కులు అందేలా ఏర్పాట్లు చేసుకున్నారు.

అది పాత పథకం కాబట్టి ఆపడానికి ఈసీ కూడా అవకాశం లేకుండా చేశారు. ఆ రైతు బంధు చెక్కులు ఓట్ల పంట పండించింది. మళ్లీ అధికారంలోకి వచ్చారు. అయితే కేసీఆర్ ఇప్పుడు అధికారంలోకి రావడానికి మరొకసారి అలాంటి ప్లానే అమలు చేస్తున్నారు. తాను ప్రకటించిన పథకాలన్నీ అమలు ప్రారంభించేస్తున్నారు. మైనార్టీ బంధు పథకాన్ని 16న తేదీన ప్రారంభించనున్నారు. ఆ రోజు నుంచి చెక్కులు జారీ చేస్తారు. గృహలక్ష్మి పథకం కింద రూ. మూడు లక్షల చెక్కులకు దరఖాస్తులు తీసుకోవడం ప్రారంభించారు. త్వరలో పథకం ప్రారంభమవుతుంది.

 

ఇప్పటికే ప్రభుత్వం వద్ద వివిధ పథకాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. వారిలో కొంత మందికి డబ్బులు ఇచ్చి మిగిలిన వాళ్లందరికీ ఎన్నికలు అయిపోగానే ఇస్తామని చెప్పడం కామన్. అయితే సాధారణంగా డిసెంబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అంటే అక్టోబర్ లో నోటిఫికేషన్ వస్తుంది. కానీ అక్టోబర్ లోనే ఎన్నికలు జరుగుతాయని,ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదట్లోనే నోటిఫికేషన్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే పథకాల అమలును చకచకా ప్రారంభిస్తున్నారని చెబుతున్నారు. కేసీఆర్ వ్యూహం ప్రకారంఓటింగ్ కు ముందు పెద్ద ఎత్తున లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా పథకాలను ప్రారంభిస్తున్నారని భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -