Heart Stroke: నోట్లో ఈ సమస్య ఉంటే గుండెపోటు గ్యారంటీగా వస్తుందట.. జాగ్రత్త పడాల్సిందేనా?

Heart Stroke: మనం ఎంతో స్వేచ్ఛగా నవ్వుతూ నలుగురిలో మాట్లాడాలన్నా మన నోరు చాలా శుభ్రంగా ఉండాలి. నోటి నుంచి ఏ విధమైనటువంటి దుర్వాసన లేకుండా ఉన్నప్పుడే ఇతరులతో మనం చాలా స్వేచ్ఛగా హాయిగా నవ్వుతూ మాట్లాడగలం. ఇలా స్వేచ్ఛగా మాట్లాడాలి అంటే నోరు దుర్వాసన రాకుండా ప్రతిరోజు శుభ్రంగా బ్రష్ చేయడం చాలా అవసరం. చాలామంది వారి పనులలో పడి వారికి ఇష్టం వచ్చినప్పుడు బ్రష్ చేస్తూ ఉంటారు ఇది సరైన పద్ధతి అసలు కాదని నిపుణులు చెబుతున్నారు.

ఇకపోతే చాలామంది ఉదయమే బెడ్ కాఫీ అల్పాహారం తింటూ అనంతరం బ్రష్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల నోటిలో పెద్ద ఎత్తున బ్యాక్టీరియా పెరిగిపోతుంది. ఇలా బ్యాక్టీరియా పెరగడం వల్ల నోరు దుర్వాసన రావడమే కాకుండా గుండె జబ్బులకు కారణం అవుతుంది. అలాగే క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ప్రతిరోజు ఉదయం సాయంత్రం తప్పనిసరిగా బ్రష్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది.

 

ఇలా సరైన విధంగా బ్రష్ చేయకపోయినా పంటి నొప్పి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అందుకే ప్రతిరోజు ఉదయం సాయంత్రం మూడు నిమిషాల పాటు బ్రష్ చేయడం ఎంతో ముఖ్య బ్రష్ చేసిన తర్వాత మౌత్ వాష్ పుక్కిలించడం ఇంకా మంచిది అయితే చాలా మంది మౌత్ వాష్ ఒకటే ఉపయోగిస్తే చాలు బ్రష్ చేయాల్సిన పని లేదనీ భావిస్తూ ఉంటారు. కానీ ఇది పూర్తిగా తప్పని నిపుణులు చెబుతున్నారు.

 

నోటిలో బ్యాక్టీరియా పెరగకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా బ్రష్ చేసి అనంతరం మౌత్ వాష్ చేయాలి రోజుకు రెండుసార్లు బ్రష్ తప్పనిసరి. ఇలా రెండుసార్లు బ్రష్ చేయడం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా నలుగురిలో కూడా ఎంతో స్వేచ్ఛగా నవ్వుతూ మాట్లాడవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -