Actress: తండ్రి పాడె మోసిన ప్రముఖ నటి.. ఈ కష్టం పగోళ్లకు కూడా అస్సలు రాకూడదంటూ?

Actress: బాలీవుడ్ నటి అంకితా లోఖండే గురించి మనందరికీ తెలిసిందే. ఈమె కంగనా రనౌత్ నటించిన మణికర్ణిక సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. వెండితెరకు పరిచయం కాకముందే ఈమె బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. కాగా ఈమె దివంగత నటుడు సుశాంత్ సింగ్ ప్రేయసిగా మనందరికీ సుపరిచితమే. సుశాంత్ సింగ్, ఆరేళ్ల పాటు డేటింగ్ చేశారు. అనంతరం విడిపోయింది. సుశాంత్ తో ఆరేళ్ళు ప్రేమలో ఉన్న అంకిత బ్రేకప్ చెప్పి మరొక వ్యక్తిని వివాహమాడింది. ఇది ఇలా ఉంటే తాజాగా అంకిత ఇంటీ తీవ్ర విషాదం నెలకొంది.

ఆమె తండ్రి శశికాంత్‌ లోఖండే శనివారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతోతో బాధపడుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు. ఇక తండ్రి మరణంతో అంకిత కుంగిపోయింది. నేడు శశికాంత్‌ లోఖండే అంత్యక్రియలు నిర్వహించారు. కూతురు అయిన అంకిత తండ్రి పాడేను మోస్తూ కనిపించింది రోడ్డుపై తండ్రి పాడెను మోస్తూ గుండెలు పగిలేలా ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తండ్రి లేని లోటును ఉహించుకోలేని ఆమె భర్తను పట్టుకొని కన్నీరుమున్నీరుగా విలపించింది.

 

ఇండస్ట్రీలో కెరీర్ మొదలు పెట్టినప్పుడు చేతులో డబ్బులు లేక, కనీసం రూమ్ రెంట్ కు కూడా కట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు తన తండ్రే తనకు తెలియకుండా రూమ్ రెంట్ కట్టేసేవాడని, తాను ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం తన తండ్రినే అని ఆమె ఎన్నోసార్లు తెలిపింది. ఇక అంకితను భర్త విక్కీ జైన్‌ ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో అభిమానులను కంటనీరు తెప్పిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -