Anil Sunkara: అనిల్ సుంకరను చిరంజీవి అలా మోసం చేశారా.. మెగాస్టార్ నిజస్వరూపం ఇదేనా?

Anil Sunkara: మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం భోళా శంకర్. ఎన్నో అంచనాలను ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ గా నిలిచింది.తమిళ వేదాలం సినిమాకు రీమేక్ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది సినిమా కలెక్షన్ల పరంగా చూస్తే ఆచార్య సినిమా కన్నా ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచిపోయిందని చెప్పాలి.

ఇక ఈ సినిమా విషయంలో అనిల్ సుంకరను చిరంజీవి దారుణంగా మోసం చేశారని ఓ వార్త వైరల్ గా మారింది. ఎమ్మెల్యే కాలనీలో ఓ బంగ్లా అమ్మకానికి రావడంతో చిరంజీవి తన చిన్న కుమార్తె కోసం ఈ ఇంటిని కొనుగోలు చేశారట అయితే ఆ సమయంలో మైత్రి వారితో 10 కోట్లు అనిల్ సుంకరతో 10 కోట్లు ముందుగానే ఇప్పించుకొని చిరు ఈ ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తోంది.

 

మైత్రి వారితో తీసుకున్న 10 కోట్లు వాల్తేరు వీరయ్య రెమ్యూనరేషన్ లో సెటిల్ చేశారని తెలుస్తుంది. అనిల్ సుంకర దగ్గర తీసుకున్న 10 కోట్లను భోళాశంకర్ సినిమాతో సెటిల్ చేయాలని భావించారు కానీ చిరంజీవి మాత్రం తనకు రెమ్యూనరేషన్ వద్దు సినిమాలో పార్ట్నర్షిప్ కావాలని కోరాడట అదే విధంగా సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు తో తనకు పాత కమిట్ మెంట్ ఉంది కాబట్టి ఆయన్ను కూడా చేర్చుకుందాం అనుకున్నారు.

 

ఇక వీరిద్దరూ పార్టనర్స్ గా ఉంటే రిస్క్ తక్కువగా ఉంటుందని భావించిన అనిల్ ఈ సినిమాకు కమిట్ అయ్యారు. ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఒకరోజు అనిల్ వద్దకు వచ్చినటువంటి చిరంజీవి తాను ఈ సినిమాకు పార్ట్నర్ గా ఉండాలని తనకు రావాల్సిన రెమ్యూనరేషన్ మొత్తం సెటిల్ చేయమని చెప్పడంతో చేసేదేమీ లేక అనిల్ తన ల్యాండ్ ఆమె మరి ఆయనకు సెటిల్ చేశారని తెలుస్తుంది ఇక ఇందులో కె.ఎస్.రామారావు కనుక నిర్మాతగా ఉంటే అప్పుల వాళ్ళు వచ్చే సినిమాపై పడతారని చెప్పి ఆయనని తప్పించారు.

 

ఇలా వీరిద్దరూ తప్పుకోవడంతో అనిల్ సుంకర పరిస్థితి మునిగిపోతున్న పడవపై ఒంటరి ప్రయాణం చేసినట్టు అయింది.ఇక అందరూ అనుకున్న విధంగానే ఈ సినిమా డిజాస్టర్ కావడం చిరంజీవి సేఫ్ అవుతూనే అనిల్ సుంకరకు భారీగానే నష్టాలను మిగిల్చారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -