NTR Bunny: ఆ మూవీ నువ్వు చేస్తే చూడాలని ఉంది బావ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు బన్నీ అలా చెప్పారా?

NTR Bunny: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు, హీరోలు, హీరోయిన్స్ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండడం అన్నది కామన్. బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న సెలబ్రిటీలు చాలా అరుదుగా మాత్రమే కలిసి కనిపిస్తూ ఉంటారు. హీరోయిన్ల సంగతి పక్కన పెడితే హీరోలు బాగా చనువుగా ఉంటే ఏరా, బావా మామ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. అటువంటి వారిలో టాప్ ప్లేస్ లో ఉంటారు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం గురించి చదువు గురించి మనందరికీ తెలిసిందే.

అంత బాగానే ఉంది కానీ ఒక సినిమా విషయంలో మాత్రం ఏకంగా అల్లు అర్జున్ నే తారక్ కి ఫోన్ చేసి మరి స్వయంగా ఈ సినిమా నువ్వు చేస్తేనే బాగుంటుంది అని చెప్పారట. ఆ సినిమా మరేదో కాదు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ. ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తాడు. ఈ సినిమాలో ఒకవైపు సాఫ్ట్ నేచర్ తో కనిపిస్తూనే మరోవైపు ఎమోషన్స్ ని బాగా పండిస్తాడు. కాగా 2018 లో విడుదల అయిన ఈ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవి ఫుల్ 150 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది.

 

అయితే ఇందులో మొదటగా త్రివిక్రమ్ ఫస్ట్ గా అల్లు అర్జున్ హీరోగా అనుకున్నారట. కథ కూడా వివరించారట. కానీ అల్లు అర్జున్ కి ఈ కథ తన కంటే ఎన్టీఆర్ కి బాగా సూట్ అవుతుందని చెప్పడంతో ఎన్టీఆర్ వద్దకు ఈ కథను తీసుకెళ్లాడట త్రివిక్రమ్ అంతే కాదు బన్నీ సైతం ఈ కథ నువ్వు చేస్తేనే బాగుంటుంది బావ నిన్ను ఇలాంటి కథలి చూడాలని ఉంది అంటూ కోరాడట. అలా బన్నీ కోరిక మేరకే ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించాడు..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -