Allu Arjun: స్మగ్లర్ పాత్రకు అవార్డేంటి.. అల్లు అర్జున్ ను వాళ్లు మామూలుగా టార్గెట్ చేయట్లేదుగా!

Allu Arjun: జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అరుదైన ఘనతను సాధించిన విషయం తెలిసిందే. అయితే జాతీయ నేషనల్ అవార్డ్స్ కమిటీ ఏ ముహూర్తాన అల్లు అర్జున్ పేరు ప్రకటించిందో గాని అప్పటి నుంచి అల్లు అర్జున్ పై ట్రోల్స్ నెగటివ్ కామెంట్స్ మామూలుగా రావడం లేదు. నెటిజెన్స్ మాత్రమే కాకుండా ఇతర ఇండస్ట్రీలలో సెలబ్రిటీలు వారి అభిమానులు కూడా అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప రాజ్ పాత్ర‌కి జాతీయ అవార్డు ఏంటి? అంటూ ప్రశ్నిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.

అయితే పుష్ప మూవీలోని ఆ పాత్ర‌కి అవార్డు రావ‌డంపై కొంత మంది అభ్యంత‌ం వ్య‌క్తం చేస్తున్నారు. పుష్ప‌ మూవీలో బ‌న్నీ పాత్ర ప‌రంగా చూస్తే అది నెగిటివ్ రోల్ అన్న‌ది వాస్త‌వం. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ చేసే రోల్. ఆ లీడ్ రోల్ తోనే క‌థ న‌డుస్తుంది. సాధార‌ణంగా హీరోలంటే తెర‌పై చాలా మంచోళ్లుగా క‌నిపిస్తారు. ఎక్క‌డా పాత్ర‌లో నెగిటివిటీ అనేది ఉండ‌దు. కానీ పుష్ప‌రాజ్ పాత్ర చాలా వ‌ర‌కూ నెగిటివ్ గానే ఉంటుంది. అందులో హీరో క్యార‌క్ట‌రైజేష‌న్ అనేది పూర్తిగా సెల్పీష్ గా ఉంటుంది.

 

డ‌బ్బు సంపాదించ‌డం కోసం ఎన్ని అడ్డ‌దారులైనా వెత‌కొచ్చు, త‌ప్పు లేదు అన్న‌ది పుష్ప‌రాజ్ నైజం. అయితే ఇప్పుడీ అంశాల్ని ప‌ట్టుకుని కొంత మంది అవార్డు రావ‌డం ఏంట‌ని బుర‌ద చ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇలాంటి పాత్ర‌ల‌కు కూడా అవార్డులిస్తారా? అని వ్య‌గ్యంగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. గ‌తంలో అవ‌ధాని గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు కూడా పుష్ప రాజ్ పాత్ర‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.
అలా బ‌న్నీపై కొంత నెగిటివిటీని స్ప్రెడ్ చేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -