NTR: సీనియర్ ఎన్టీఆర్ కార్యక్రమాలకు దూరంగా జూనియర్.. తాతంటే ప్రేమ లేదా తారక్ అంటూ?

NTR : నందమూరి తారక రామారావు ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది. తెలుగుజాతికి ఒక రికగ్నైజేషన్ తీసుకువచ్చిన రాజకీయ నాయకుడు. అలాగే సినిమాలలో సైతం దేవుడు అంటే ఎన్టీఆర్ ని మాత్రమే నేటికీ తలుచుకుంటారు ప్రేక్షకులు. అలాంటి నవరస నటన సార్వభౌముడు సీనియర్ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు ఆ మధ్య ఘనంగా జరిగాయి. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా, ఆయన జ్ఞాపకాలు ఇంకా మన కళ్ళ ముందు కదులుతూనే ఉన్నాయి.

అయితే ఆయన శతజయంతి వేళ 100 రూపాయల నాణెం మీద ఆయన చిత్రాన్ని చిత్రిస్తూ ఒక నాణెం తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్రపతి భవనంలో ఆగస్టు 28న జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు మరొక 100 మందిని ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమానికి సీనియర్ ఎన్టీఆర్ ముద్దుల మనవడు, నేటి సూపర్ స్టార్ అయినా జూనియర్ ఎన్టీఆర్ హాజరు కావడం లేదు.

 

శతజయంతి ఉత్సవాలప్పుడు కూడా ఆయనని ఆహ్వానిస్తే విదేశాలలో పుట్టినరోజు జరుపుకుంటున్న కారణంగా రాలేనంటూ చెప్పుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్. కానీ నేటి కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొకపోవడం వలన ఆయన మీద ఫైర్ అవుతున్నారు సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు. తాతంటే ప్రేమ లేదా జూనియర్ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ కి ఒక లైఫ్ ఇచ్చింది సీనియర్ ఎన్టీఆర్. చిన్న వయసులోనే జూనియర్ ఎన్టీఆర్ లో నటుడిని బయటికి తీసి ఆయన సినిమాలో ఒక వేషం వేయించారు సీనియర్ ఎన్టీఆర్.

 

అలాంటి తన తాత గారి ముఖ్యమైన కార్యక్రమం శతజయంతి ఉత్సవాలకి వెళ్ళలేదు సరి కదా ఈ కార్యక్రమానికి కూడా వెళ్లకపోవడానికి కారణమేమిటో అంటూ రకరకాల వార్తలు వినబడుతున్నాయి. శతజయంతి ఉత్సవాలు అంటే పోనీ టీడీపీ ఆధ్వర్యంలో జరిగాయి కాబట్టి వెళ్ళలేదు అనుకోవచ్చు. కానీ ఈ కార్యక్రమం పూర్తిగా పురందరేశ్వరి ఆధ్వర్యంలో నడిచింది. అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. దీనిపై వస్తున్న ట్రోల్స్ కి జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -