Chandramukhi 2: చంద్రముఖి మూవీ డిజాస్టర్ కావడం గ్యారంటీనా.. లారెన్స్ మూవీకి భారీ నష్టాలు తప్పవా?

Chandramukhi 2: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన చిత్రం చంద్రముఖి. 18 ఏళ్ల కిందటే విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవటంతో భారీగా కనెక్షన్స్ ను సాధించింది. అంతేకాకుండా సూపర్ స్టార్ రజినీకాంత్ కెరియర్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి. ఇది ఇలా ఉంటే దాదాపు కొన్ని ఏళ్ల తర్వాత చంద్రముఖి సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించారు. చంద్రముఖి 2 సినిమాతో త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో రాఘవ లారెన్స్ హీరోగా నటించగా కంగానా రనౌత్ చంద్రముఖి పాత్రలో నటించింది.

లైకా ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్థ ఈ ప్రాజెక్టును నిర్మించింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ఏ ప్రోమో కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. రాజు పాత్రలో రాఘవ లారెన్స్ లుక్ చూసి ఇదేమైనా చంద్రముఖి స్పూఫా అనిపించింది. రజినీని కనీస స్థాయిలో కూడా అతను మ్యాచ్ చేయలేకపోయాడు. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో లారెన్స్ మోడర్న్ గెటప్‌లో, అలాగే రాజుగా ఏమాత్రం మెప్పించలేకపోయాడు. రాజు పాత్రలో అతణ్ని చూస్తుంటే పక్కాగా ఇది స్పూఫ్ మూవీనే అనిపించింది.

ట్రైలర్ మినిమం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయింది. పి.వాసు ఔట్ డేటెడ్ స్టయిల్లోనే సినిమాను డీల్ చేసినట్లున్నాడు. చూస్తుంటే నాగవల్లి సినిమాని మించి చంద్రముఖి-2 ట్రోల్స్ ని ఎదుర్కొనేలా కనిపిస్తోంది.. మరి అభిమానులు ప్రేక్షకుల అంచనాలను తిరగరాసి ఈ సినిమా సూపర్ హిట్ గా నిలుస్తుందా, లేదా అన్నది చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -