Jagan: చంద్రబాబు తర్వాత జగన్ సర్కార్ టార్గెట్ అతనేనా.. టీడీపీ విషయంలో వైసీపీ దారుణమైన ప్లాన్!

Jagan: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు స్కిల్ స్కాం అరెస్టుతో చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి గత నాలుగు ఏళ్లలో ఏ కోర్టులోను ఇబ్బంది కలగలేదు. కోర్టు తలుపులు తట్టి ఏపీలో పాలన స్తంభింప చేయగలిగారు తెలుగుదేశం వాళ్ళు. అన్ని కేసులలో గెలిచినా రెండు పిటిషన్ల విషయంలో చంద్రబాబుకి గట్టి దెబ్బ తగిలింది.

జ్యూడిషియల్ రిమాండ్ కి కోర్టు పర్మిషన్ ఇవ్వదు అనుకుంటే ఆఖరికి హౌస్ అరెస్ట్ కోరిన కూడా కోర్టు పర్మిషన్ ఇవ్వలేదు.ఈ విషయంలో జగన్ చంద్రబాబు నాయుడు పై నెగ్గాడని చెప్పాలి. పాపం చంద్రబాబు నాయుడు ఎంతో ఖర్చు పెట్టి లాయర్ ని పెట్టుకున్నా అతని వాదన ఫలించే లాగా లేదు. అయితే చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడంతో జగన్ వర్గం వారు శాంతిస్తారు అనుకుంటే అది పొరపాటే.

వారి నెక్స్ట్ టార్గెట్ లోకేష్ ఎందుకంటే సిఐడి వాళ్ళు సమర్పించిన రిపోర్టులలో నారా లోకేష్ పేరు కూడా ఉంది ఆయన కూడా అరెస్ట్ అవ్వడం ఖాయం కానీ ఎప్పుడూ అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అరెస్టు జరగడానికి ముందు రోజే ఇద్దరు నిందితులు అమెరికాకి పారిపోవటం అనేది చంద్రబాబు కి పెద్ద ఇబ్బందిగా మారింది అంటున్నారు ఒక వర్గం వారు. అయితే చంద్రబాబు నాయుడు వారిని ప్లాన్ ప్రకారం పంపించేశాడు అని ఒక వర్గం వారు అంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే జగన్ నారా లోకేష్ ని అరెస్ట్ చేసి సంతృప్తి చెందడిని..

చంద్రబాబు నాయుడుకి సపోర్టుగా ఉన్న ప్రతి తెదేపా నాయకుడిని చంద్రబాబు దగ్గరికి పంపించడానికి పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. ఎన్నికలవేళ ఎన్నికల వ్యూహరచన చేయకుండా కేసులు నుంచి బయటపడటం ఎలా అనే వ్యూహరచనలో తల మునకలు అయ్యేలాగా ప్లాన్ చేశాడు జగన్. చూడాలి మరి అతని ప్లాన్ వర్క్ అవుట్ అయ్యి అతనే గద్దెనెక్కుతాడో లేదంటే చంద్రబాబు నాయుడు పై సింపతీ పెరిగిపోయి అతనే గద్దెనెక్కుతాడో తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -