Astrologer Venu Swamy: చంద్రబాబు ఆ పూజ చేసి ఉంటే ఈ గతి పట్టేదా.. వేణుస్వామి చెప్పిన విషయాలివే!

Astrologer Venu Swamy: ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి మనందరికీ తెలిసిందే. ఈ సెలబ్రిటీలు రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలు చెబుతూ బాగా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా సమంత నాగచైతన్య విడాకుల వ్యవహారం తర్వాత మరింత పాపులారిటీ సంపాదించుకున్నారని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో ఈయనకు బాగా పాపులారిటి పెరిగిపోవడంతో పెద్దపెద్ద హీరోయిన్లు కాంటాక్ట్ అవ్వడంతో పాటు పూజలు కూడా చేయించుకుంటున్నారు. కేవలం సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలు కూడా చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా చంద్రబాబు నాయుడు గురించి స్పందించిన వేణు స్వామి ఆయన జాతకం గురించి తెలిపారు. ఈ సందర్బంగా వేణు స్వామి మాట్లాడుతూ.. 2023 అనగా ఈ ఏడాది జనవరి నుంచి చంద్రబాబు ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు ఎదుర్కొంటారు. ఆయన జాతకంలో గ్రహాలు మారడం వల్ల ఆయనకు ఆరోగ్యపరమైన అలాగే న్యాయపరమైన ఇబ్బందులు తప్పవు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వేణు స్వామి ఈ విషయాలను గత ఏడాది ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పుడు వేణు స్వామి చెప్పినట్టుగా చంద్రబాబు కష్టాలు పడుతుండడంతో ఆ వీడియోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

వేణు స్వామి చెప్పినట్టుగా జాతక పరమైన పూజలు చేయించుకుని ఉంటే చంద్రబాబుకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని కామెంట్లు ఇస్తున్నారు. ఇటీవలే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే బాబు అరెస్టుతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అప్పటివరకు రాజకీయ వాతావరణం కూల్ గా ఉండగా బాబు అరెస్టుతో వేడెక్కడంతో పాటు ఎక్కడ చూసినా కూడా ధర్నాలు నిరసనలు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -