Upasana-Ramcharan: ఉపాసన చరణ్ పెళ్లికి సంబంధించి చరణ్ కు పెట్టిన షరతు ఇదే.. మరీ అలా చేశారా?

Upasana-Ramcharan: మెగా ఇంటి కోడలుగా ఉపాసన కామినేని అడుగుపెట్టి మెగా ఇంటి కుటుంబ బాధ్యతలను పరువు ప్రతిష్టలను తన భుజాలపై వేసుకొని మెగా ఇంటికి ఏమాత్రం మచ్చ తీసుకురాకుండా ఎంతో గొప్పగా బ్రతుకుతున్నారని చెప్పాలి. ఇలా మెగా ఇంటి కోడలుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఉపాసన ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఎంతో సంపన్నుల కుటుంబం నుంచి మెగా ఇంటికి కోడలుగా వచ్చినటువంటి ఈమె ఏ మాత్రం గర్వం లేకుండా ఎంతో మంచి మనసుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇలా రామ్ చరణ్ ఉపాసన ప్రేమించుకుని పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇలా వీరి వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన 11 సంవత్సరాలకు వీరికి కూతురు జన్మించడంతో ప్రస్తుతం ఈ దంపతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఉపాసన రాంచరణ్ పెళ్లి జరిగి దాదాపు 11 సంవత్సరాలు అవుతున్నటువంటి తరుణంలో వీరి పెళ్లి సమయంలో రామ్ చరణ్ చిరంజీవి ఉపాసన తాతగారు ప్రతాప్ రెడ్డి పెట్టిన కండిషన్ గురించి ఒక వార్త వైరల్ గా మారింది.

రామ్ చరణ్ ఉపాసనల పెళ్లి చేయాలి అనుకున్నటువంటి తరుణంలో అపోలో హాస్పిటల్ చైర్పర్సన్ ఉపాసన తాతగారు ప్రతాపరెడ్డి చిరంజీవి రామ్ చరణ్ లకు ఒకేసారి తన మనవరాలు విషయంలో కొన్ని కండిషన్స్ పెట్టారట.ప్రస్తుత కాలంలో చాలామంది పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత తమ భార్య కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కావాలని ఆలోచిస్తున్నారు. అయితే నా మనవరాలు విషయంలో అలా ఉండకూడదని ఈయన చెప్పారట.

నా మనవరాలికి అత్తగారింట్లోకి వచ్చిన తర్వాత కూడా తనకంటూ స్వేచ్ఛ కావాలి తన పనులను తాను చేసుకునే స్వేచ్ఛ మీరు కల్పించాలి అంటూ రామ్ చరణ్ చిరంజీవికి కండిషన్ పెట్టడంతో ఆయన అడిగే విధానంలో కూడా న్యాయం ఉందని భావించినటువంటి చిరంజీవి ఈ కండిషన్ కి ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఇచ్చిన మాట ప్రకారమే చిరంజీవి కూడా ఉపాసనకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చి ఆమె అనుకున్నటువంటి కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేయడంలో మెగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఎంతో ఉందని చెప్పాలి ఇక ఉపాసన ప్రస్తుతం అపోలో హాస్పిటల్ బాధ్యతలను చేపట్టడమే కాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -