Vastu Tips: ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే కోటీశ్వరులు కావడం గ్యారంటీ.. వద్దన్నా ధనం వస్తుందంటూ?

Vastu Tips: ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో ఎంత సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఇలా జీవితంలో సంతోషంగా ఉండడం కోసం ఎన్నో రకాల పూజలు వ్రతాలు చేస్తారు. అలాగే దేవుడి పైన భారం వేయకుండా మనం కూడా కష్టపడుతూ మనకు సంపద కలగాలని ప్రార్థిస్తుంటారు. అయితే ఎంత కష్టపడినా కొందరి చేతిలో మాత్రం డబ్బు నిలబడదు. మన చేతిలో డబ్బు నిలబడి ఆర్థికంగా ఉన్నత స్థానంలోకి వెళ్లాలి అంటే కొన్ని వాస్తు పరిహారాలను పాటించాలని పండితులు చెబుతున్నారు. ఆ వాస్తు పరిహారాలు ఏంటి అనే విషయానికి వస్తే…

స్వస్తిక్ చిహ్నం ఎంతో శుభప్రదం అందుకే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే స్వస్తిక చిహ్నాన్ని రాగితో తయారు చేయించి ఆగ్నేయ దిశ వైపు పెట్టడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది . అలాగే ఉత్తరం వైపు మనం డబ్బులు దాచుకున్నటువంటి డబ్బాని పెట్టి దానికి నీలం రంగు తామర పువ్వులు ఉంచడం వల్ల సంపద అభివృద్ధి చెందుతుంది. చెత్తబుట్టని ఎప్పుడూ కూడా ఉత్తరం, పడమర, ఆగ్నేయం వైపు పెట్టకుండా చూసుకోండి.

అలాగే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అంటే తప్పనిసరిగా మన ఇంటిని ఎంతో శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలా మన ఇల్లు శుభ్రంగా ఉన్నప్పుడే ఇంటిలోకి లక్ష్మీదేవి వస్తుందని అలా కాకుండా ఇంటిని మొత్తం చెత్తగా పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ వ్యాప్తి చెంది ఏ విధమైనటువంటి ఆర్థిక ఎదుగుదల లేకుండా పూర్తిగా అప్పులు పాలు కావడం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది. అందుకే ఈ వాస్తు పరిహారాలను పాటించడం వల్ల లక్ష్మీదేవి కరుణ కటాక్షాలను పొందుతాము.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -