Hari Teja: సాయిపల్లవి అక్కగా వచ్చిన ఛాన్స్ ఆ కారణం వల్ల పోయింది.. హరితేజ షాకింగ్ కామెంట్స్!

Hari Teja : హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం మామా మశ్చీంద్ర. ఈ సినిమాలో ఈషా రెబ్బా, మృణాళిని రవి ఇందులో హీరోయిన్లుగా కనిపించనున్నారు. కాగా ఇందులో హీరో సుధీర్‌ త్రిపాత్రాభినయం చేశారు. ఈ సినిమా ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కి దర్శకుడు శేఖర్‌ కమ్ముల, హీరోలు శర్వానంద్‌, విశ్వక్‌సేన్‌, శ్రీవిష్ణు, అశోక్‌ గల్లా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాగా ఈ సినిమాలో నటి హరితేజ కూడా ఒక కీలక పాత్రలో నటించింది.

ఇక తాజాగా ఈవెంట్ లో పాల్గొన్న హరితేజ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శేఖర్ కమ్ముల గారు మిమ్మల్ని చూడగానే ఒకటి గుర్తొచ్చింది. చెప్పుకోవాలనిపిస్తోంది. మంచి అనుభవం. నేను మీ ఫిలింస్‌కి ఫ్యాన్ సర్. ఫిదా సినిమాలో అక్క క్యారెక్టర్ కోసం నన్ను ఆడిషన్‌కి రమ్మని పిలిచారు. నేను ఎలాగైనా మీ దర్శకత్వంలో సినిమా చేయాలని రెండు మూడు సార్లు వచ్చి ఆడిషన్ ఇచ్చాను. కానీ అప్పుడు నేను ఎందుకు రిజెక్ట్ అయ్యానో తెలుసా తెలంగాణ యాస రాలేదని. ఆ సినిమా తర్వాత నేను తెలంగాణ యాస నేర్చుకున్నాను సర్. ఇప్పుడు అసలు తెలంగాణ యాసలో ఇచ్చిపడేస్తున్నాం సర్‌.

మరీ అంత ప్యూర్‌ కాకపోయినప్పటికి ప్రస్తుతం నేను ప్రయత్నిస్తున్నాను అని నవ్వుతూ చెప్పుకొచ్చింది హరితేజ. ఈ సందర్భంగా హరితేజ మాట్లాడిన మాటలకు శేఖర్‌ ఖమ్మల కూడా బాగా ఎంజాయ్‌ చేశాడు. ఇందులో హరితేజ ఓల్డ్‌ ఉమెన్‌ పాత్రలో కనిపించనుంది. ఇకపోతే హరితేజ విషయానికి వస్తే ఈమె బుల్లితెరపై పలు షోలకు యాంకర్ గా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పలు సీరియల్స్ లో కూడా నటించి మెప్పించింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -