Tamil Nadu: సీఎం స్టాలిన్ కుమార్తె గుడిలో పూజలు.. ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు ఏం చెబుతారంటూ?

Tamil Nadu: తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూతురు సెంథామరై స్టాలిన్ మైలదుత్తురై జిల్లా సిర్కాజిలోని సత్తైనాథర్ ఆలయాన్ని సందర్శించి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన ఆమెకు ఆ ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత ఆమె సెంటామరై గోయువులోకి వెళ్లి, స్వామి అంబాల్ చట్టినాధర్, అష్ట భైరవ ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శివాచార్యులు ఆలయ ప్రసాదాలు అందజేశారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు ఇటీవల ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తున్నారు. ఇది సనాతన ధర్మం కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు? ఇంకొంత మంది పలు రకాలుగా కామెంట్లు చేస్తు ట్రోల్ చేస్తున్నారు. కాగా చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో గతంలో ఉదయనిధి సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ, కరోనా వంటి వ్యాధులతో పోల్చిన విషయం తెలిసిందే. అంతేకాదు సనాతన ధర్మం ఉండకూడదని అన్నారు.

ఆ సమయంలో ఉదయనిది స్టాలిన్ పై పెద్ద ఎత్తున విమర్శలు గుర్తించిన విషయం తెలిసిందే. కొందరు ఆయనకు మద్దతుగా కామెంట్స్ చేయగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆయనపై కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఇంకొందరు సెంథామరై స్టాలిన్ పూజలు చేసుకుంటే మీకేంటి ఇబ్బంది మళ్లీ ఇందులో ఉదయనిది స్టాలిన్ ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు ఆ విషయాన్ని ఆ గొడవను ఎందుకు మరి గెలుకుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -