Pakistan: మా దేశం విడిచి వెళ్లిపోండి.. 17 లక్షల మందికి భారీ షాకిచ్చిన పాకిస్తాన్!

Pakistan: ఆఫ్ఘనిస్తాన్ నుంచి శరణ కొరుతూ కొన్ని లక్షల మంది పాకిస్తాన్ చేసుకున్నారు. ఇలా అక్రమంగా పాకిస్తాన్ లోకి వచ్చిన వారు వెంటనే తమ దేశం విడిచి వెళ్లిపోవాలని పాకిస్తాన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ వారికి ఇది భారీ షాక్ అని చెప్పాలి. ఈ విధంగా పాకిస్థాన్లోకి ఆక్రమంగా చొరబడిన వారు నవంబర్ ఒకటవ తేదీ లోపు పాకిస్తాన్ నుంచి వెళ్లకపోతే వారిని బలవంతంగా దేశం నుంచి బహిష్కరించాల్సి వస్తుందని పాక్ ఆదేశాలు జారీ చేసింది.

ఆఫ్ఘనిస్తాన్ ను2021 వ సంవత్సరంలో తాలిబండ్లు ఆక్రమించుకున్న తర్వాత పెద్ద మొత్తంలో పాకిస్తాన్లోకి వచ్చారు. అయితే ఇందులో చాలామంది పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఉండగా దాదాపు 17 లక్షల మంది వరకు ఏ విధమైనటువంటి అనుమతి లేకుండా పాకిస్థాన్లోకి వచ్చారని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సర్పరాజ్ బుగిటి తెలియచేశారు.

ఇలా ఏ విధమైనటువంటి అనుమతి లేకుండా పాకిస్తాన్లోకి వచ్చిన ఆఫ్గానిస్థాన్ వారందరూ కూడా తక్షణమే దేశం ఖాళీ చేసి వెళ్లిపోవాలి లేకపోతే వారందరూ ఎక్కడ ఉన్నారో గుర్తించి భద్రతా బలగాల సహాయంతో వారిని ఇక్కడి నుంచి తరిమేయాల్సి ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. నవంబర్ ఒకటి తరువాత పాస్ పోర్ట్ వీసా లేకుండా దేశంలోకి ఎవరిని అనుమతించేది లేదని పేర్కొన్నారు.

పాకిస్తాన్ పౌరులు కాకుండా ఐడి కార్డ్స్ ఉన్నప్పటికీ వారి జాతీయతను గుర్తించడం కోసం డిఎన్ఏ పరీక్షలు చేయాలని పాక్ మంత్రి స్పష్టం చేశారు. ఏ విధమైనటువంటి అనుమతి లేనటువంటి వారిని మాత్రమే కాకుండా అనుమతి ఉన్నటువంటి వారిని కూడా పాకిస్తాన్ పంపించడం కోసం ప్రయత్నాలు చేస్తుందని కొన్ని మీడియా కథనాలు రావడంతో పలువురు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -