Naresh: చంద్రబాబు అరెస్ట్ ఆత్మహత్యతో సమానం.. వైరల్ అవుతున్న నరేష్ సంచలన వ్యాఖ్యలు!

Naresh: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయం ఏపీలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్టయి దాదాపు నెలరోజులు పూర్తి కావస్తోంది. టీడీపీ నేతలు బాబు ని బయటికి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవేవీ ఫలించలేదు. అయితే ఇప్పటికే ఏపీలో ఎంతోమంది చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండిస్తున్న విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున నిరసన లు చేస్తున్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్ కావడంతో సినిమా సెలబ్రిటీలు ఏ కార్యక్రమానికి హాజరైనప్పటికీ విలేకరులు ఈ విషయం గురించి వారిని ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో రవిబాబు అశ్వినీ దత్, మోహన్, నట్టి కుమార్ వంటి వారు స్పందించి ఈయనని అరెస్టు చేయడం కక్ష సాధింపు చర్య అని బాబు అరెస్టును వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలియజేశారు. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా సీనియర్ నటుడు నరేష్ ఆహా కోసం ఒక సిరీస్ చేశారు. ఈ వెబ్ సిరీస్ ది గ్రేట్‌ ఇండియన్‌ సుసైడ్‌ అనే టైటిల్ పెట్టారు ఇక ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 6 న విడుదల అయింది. ఈ సందర్భంగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా నరేష్ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈయనని మీడియా ప్రశ్నిస్తూ.. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ గురించి స్పందించమని అడిగారు.

ఇలా మీడియా వారి నుంచి ఈ ప్రశ్న ఎదురు కావడంతో నరేష్ వెంటనే ఆయన తన టైటిల్‌ వున్న పోస్టర్‌ను చూపించి ది గ్రేట్‌ ఇండియన్‌ సుసైడ్‌ అని ముగించారు. అయితే చంద్రబాబు గురించి మరొక ప్రశ్న వేయడంతో చాలా తెలివిగా నరేష్ సమాధానం చెబుతూ నేను చెప్పింది నా వెబ్‌సీరిస్‌ అంటూ తెలివిగా దాట వేశారు. నిజంగా ది గ్రేట్‌ ఇండియన్‌ సుసైడ్‌ చంద్రబాబుకా, జగన్‌ కా? అనేది డైలమాలో నరేష్ అందరిని పడేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -