Gajwel Battle: కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్.. గజ్వేల్ నియోజకవర్గంలో విజయం సాధించేది ఆయనేనా?

Gajwel Battle: బీజేపీ తొలి జాబితాలో గజ్వేల్ నుంచి ఈటెల రాజేందర్ పేరు ప్రకటించడంతో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గత రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గజ్వేల్ నియోజకవర్గం లో ఈసారి ఈటల రాజేందర్ బీజేపీ తరఫున బరిలోకి దిగుతుండటంతో అక్కడ హోరాహోరీ హోరు తప్పదని తేలిపోయింది. బీజేపీ తన మొదటి జాబితాలో 52 మంది శాసనసభ అభ్యర్థులని ప్రకటిస్తూ సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ పేరు కూడా ప్రకటించింది.

గతంలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు గజ్వేల్ నియోజకవర్గం నుంచి కూడా బరిలో ఉంటారని ప్రకటించింది. ఈ విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ రెండు రోజుల క్రితం గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన 7,000 మంది పార్టీ కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేశారు. కేసీఆర్ ఇక్కడి నుంచి గెలిచి రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఈ ప్రాంతం గొప్ప అభివృద్ధి సాధించిన మాట నిజమే.

కానీ సీఎం ఎమ్మెల్యేగా సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదనే ప్రచారం ఉంది. ఇదే విషయాన్ని కార్యకర్తలు కేసీఆర్ కి చెప్పటంతో ఎన్నికల తరువాత నెలకు ఒక రోజు గజ్వేల్ లో ఉంటానని ప్రకటించారు. రెండు దశాబ్దాలుగా సీఎం కేసీఆర్ ప్రధాన అనుచరుడుగా ఉన్న ఈటల రాజేందర్ తొలిసారి తనపైనే పోటీకి దిగటంతో రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి తూముకుంట నర్సారెడ్డి బరిలో ఉంటారని ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో మూడు పార్టీలు కూడా రాబోయే రోజుల్లో గజ్వేల్ లో పోటాపోటీగా ఎలక్షన్ మీటింగ్ లు పెట్టే అవకాశం ఉంది. పోటీ మాత్రం ప్రధానంగా ఈటల రాజేందర్, సీఎం కేసీఆర్ మధ్యలోనే ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇక్కడ ఈటెల గెలిస్తే కేసీఆర్ ని ఓడించిన పేరు దక్కుతుంది. ఓడిపోయినా కూడా తనకు వచ్చిన నష్టమేమీ లేదు. హుజురాబాద్ లో కూడా పోటీ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా గెలిస్తేనని భావిస్తున్నారు. ఈసారి ఎలాగైనా కేసీఆర్ ను గెలిచి తీరుతాను అన్న ఈటల రాజేందర్ పంతం నెగ్గుతుందో లేదో వేచి చూడాల్సిందే

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -