Allu Arjun: మరో మల్టీప్లెక్స్ దిశగా బన్నీ అడుగులు.. సినిమా సంపాదనను తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?

Allu Arjun: కోకాపేటలో భూముల రేట్లు పెరగటం కాదు గాని అప్పుడే అక్కడ వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకోవడానికి సిద్ధమవుతున్నారు బిజినెస్ పర్సన్స్. ఇప్పుడు బిజినెస్ పర్సన్స్ అంటే సినిమా వాళ్ళు కూడా ఆడ్ అవుతారు ఎందుకంటే వాళ్లు బిజినెస్ మాన్ కంటే ఎక్కువగా ఆలోచించి అడుగులు ముందుకు వేస్తున్నారు. అందులో మొదటిగా చెప్పుకోవాల్సింది మన అల్లు అర్జున్. అమీర్పేట్ సత్యం థియేటర్ స్థలంలో ప్రారంభించిన ఏఏఏ సినిమాస్ గొప్పగా ప్రజాధరణ పొందుతున్న క్రమంలో..

అల్లు అర్జున్ తో కలిసి ఏషియన్ సినిమా తన ప్రణాళికలను భారీగా విస్తరిస్తున్నారని తెలిసింది. కోకాపేట నార్సింగి పరిసరాల్లో మరో మల్టీప్లెక్స్ నిర్మించేందుకు అల్లు అర్జున్ తో టై అప్ అవుతుంది. నిజానికి కోకాపేట ఏరియా ఒకప్పుడు కారడవి కానీ ఇప్పుడు ఆ చోటు జనావాసాలతో, భారీ వ్యాపారాలతో కళకళలాడుతుంది. అందువల్ల ఆ ప్రదేశంలో మల్టీప్లెక్స్ థియేటర్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుందని అల్లు ఫ్యామిలీ భావించినట్లుగా ఉంది. అందుకే ఏఏఏ సినిమా వాళ్ళతో కలిసి వెంటనే మరో కొత్త మల్టీప్లెక్స్ నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు.

నిజానికి ఈ తరం నటులు వారి సంపాదనని సరి అయిన విధంగా పెట్టుబడును పెడుతున్నారు ఇందులో మన మహేష్ బాబు ఏబీఎన్ మాల్ పెట్టి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించారు. ఈ స్ఫూర్తితో బెంగళూరులో ఒక మాల్ ప్రారంభించేందుకు సిద్ధపడుతున్నారు దీనికి కూడా ఏషియన్ ఫిలిమ్స్ భాగస్వామిగా వ్యవహరించబోతుంది. అలాగే విజయ్ దేవరకొండ కూడా మహబూబ్ నగర్ లో ఒక వ్యాపార సముదాయం ఓపెన్ చేస్తే అది కూడా సూపర్ హిట్ కొట్టింది.

ఆ జిల్లా ప్రజలకు అది మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అలాగే శివ కార్తికేయన్ కూడా ఈ తరహా లోనే మల్టీప్లెక్స్ థియేటర్లో ఏషియన్ ఫీలింగ్స్ సహకారంతో ప్రారంభించబోతున్నారు. ఇప్పుడు బన్నీ నిర్మించబోయే ఈ మల్టీప్లెక్స్ కూడా సూపర్ హిట్ కొడుతుందని ఆశిద్దాం ఎందుకంటే బిజినెస్ ప్లాన్ వర్కౌట్ కాకపోతే ఎవరైనా ఎందుకు మరో అడుగు ముందుకు వేస్తారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -