Devara: ఇండస్ట్రీని యంగ్ టైగర్ షేక్ చేయబోతున్నారా.. గ్లింప్స్ అదుర్స్ అంటూ?

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి పోస్టర్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ విడుదల చేశారు.

 

తాజాగా దేవర సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సంక్రాంతి కానుకగా అభిమానుల ముందుకు మూవీ నుంచి గ్లింప్స్ ని తీసుకు వచ్చారు. అనిరుద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో గ్లింప్స్ అదిరిపోయింది. సముద్రంలో పెద్ద ఎత్తున యాక్షన్ సన్నివేశాలను ఇందులో చూపించారు.

ఇక ఈ వీడియోలో ఎన్టీఆర్ లుక్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ యాక్షన్ సన్నివేశాలతో సముద్రం మొత్తం ఏరుపెక్కిందని చెప్పాలి. 1:20 నిడివి ఉన్నటువంటి ఈ వీడియో అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ వీడియో చివరిలో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ ఈ వీడియోకి హైలైట్ గా మారిందని చెప్పాలి.

 

గంభీరమైనటువంటి గొంతుతో ఈ సముద్రం చేపల కంటే కత్తులు నెత్తురనే ఎక్కువ చూసి ఉంది. అందుకే దీనిని ఎర్ర సముద్రం అంటారేమో అంటూ ఎన్టీఆర్ చెప్పినటువంటి డైలాగ్ వీడియోకి హైలెట్ గా మారింది. ఇక ఈ వీడియో చూస్తుంటేనే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి దేవర సినిమా ద్వారా ఎన్టీఆర్ బాక్సాఫీస్ వద్ద మరో సంచలనమైన విజయాన్ని సొంతం చేసుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి.ఇక ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -