KTR: కరెంట్ బిల్లులు చెల్లించొద్దని చెప్పిన కేటీఆర్.. ప్రజలు పాటిస్తారా?

KTR: బీజేపీ తో బీఆర్ఎస్ కి ఏ రోజు పొత్తులేదని, బీఆర్ఎస్ ను బొంద పెట్టి తీరతానంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ లాంటి వాళ్ళని చాలామందిని చూశామని వ్యాఖ్యానించారు. అలాగే జనవరి నెలలో ఎవరూ కరెంట్ బిల్లులు కట్టవద్దంటూ తెలంగాణ ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. అలాగే రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

 

బీఆర్ఎస్ ను వంద మీటర్ల లోతున బొందపెట్టే సంగతి తర్వాత చూసుకుందాం ముందు వంద రోజులలో ఇచ్చిన హామీలను అమలు చేయండి అని కేటీఆర్ సీఎం రేవంత్ కు చురకలు అంటించారు. అహంకారంతో మాట్లాడిన రేవంత్ రెడ్డి లాంటి నాయకుల్ని బీఆర్ఎస్ తన ప్రస్థానంలో ఎంతోమందిని చూసిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ జెండాను ఎందుకుబొంద పెడతావు? తెలంగాణను అభివృద్ధి చేసినందుకా లేదంటే తెలంగాణను తెచ్చినందుకా లేక మీ దొంగ హామీలను ప్రశ్నించినందుగా అంటూ నిలదీశారు కేటీఆర్.

రేవంత్ రక్తం అంతా బీజేపీ దే అందుకే ఇక్కడ చోటా మోడీగా రేవంత్ రెడ్డి మారాడు. డబల్ ఇంజిన్ అంటే అధాని,ప్రధాని అన్న రేవంత్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజిన్ గా మారాడు. రేవంత్ కాంగ్రెస్ ఏకనాథ్ షిండేగా మారతాడు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ జనవరి నెల కరెంట్ బిల్లులు ఎవరు కట్టవద్దు ఆ బిల్లులను ఢిల్లీలోని కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఇంటికి పంపించాలంటూ తెలంగాణ ప్రజలకు పిలుపు ఇచ్చారు.

 

ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకం, గృహజ్యోతి హామీని నెరవేర్చేదాక బిల్లులు కట్టొద్దు స్వయంగా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్లు ఉచిత విద్యుత్ కోసం డిమాండ్ చేయాలి. కరెంట్ బిల్లులు కోసం ఒత్తిడి తీసుకువస్తే అలాంటి వాళ్లకి ముఖ్యమంత్రి మాటలను వినిపించండి అని చెప్పిన కేటీఆర్ గృహ జ్యోతి కార్యక్రమాన్ని వెంటనే అమలు చేయాలని అద్దె ఇంట్లో ఉండే వాళ్ళకి ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -