Padmavibhushan: పద్మవిభూషణ్ రావడం గురించి చిరు రియాక్షన్ ఇదే.. ఏమన్నారంటే?

Padmavibhushan: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి తాజాగా ఒక అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ వరించింది. ఇప్పటికే అవార్డుల రారాజుగా నిలిచిన మెగాస్టార్‌కు మరో అత్యున్నతమైన ఘనతను సొంతం చేసుకున్నారు. అయితే అంత గొప్ప అవార్డు తనని వరించడంతో మెగాస్టార్ ఆనందంలో మునిగి తిలుతున్నారు. ఈ విషయం పట్ల మెగా కుటుంబ సభ్యులతో పాటు మెగా అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు కూడా చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆయనకు ఆ అవార్డు వరించడం పట్ల స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ఆ వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించింది. ఈ సమయంలో నాకు ఏం మాట్లాడాలో కూడా మాటలు రావడం లేదు. మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబ సభ్యుల అండ దండలు, నీడలా నాతో నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగా నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నా అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

 

అలాగే నాకు దక్కిన ఈ గౌరవం మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతల కు నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను. నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తిమేరకు ప్రయత్నిస్తూనే ఉన్నాను అని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు మెగాస్టార్. ఈ మేరకు చిరంజీవి షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -