Mega Family: మెగా కుటుంబ సభ్యులకు వచ్చిన ఈ అవార్డుల గురించి తెలుసా?

Mega Family: మెగా ఫ్యామిలీకి ప్రస్తుతం అదృష్టం పట్టిపీడిస్తోంది. మెగా ఫ్యామిలీలో తరచూ ఒకరి తర్వాత ఒకరికి అవార్డులు వస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే తాజాగా మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వరించిన విషయం తెలిసిందే. కష్టపడి ఎటువంటి అండదండ్రులు లేకుండా పైకి ఎదిగే సినిమా ఇండస్ట్రీలో ఎంతోమందికి సేవలు అందించినందుకు గాను మెగాస్టార్ చిరంజీవికి ఈ పద్మ విభూషణ్ అవార్డును అందించనున్నారు. కేవలం ఇవి మాత్రమే కాకుండా ఉత్తమ నటుడిగా మూడు నందులు, ఏడు సౌత్‌ ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్నాడు.

 

ఫిలింఫేర్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌, రఘుపతి వెంకయ్య ఇలా ఎన్నో పురస్కారాలు ఆయనను వరించాయి. 2006లో పద్మ భూషణ్‌ అందుకున్న ఆయన 18 ఏళ్ల తర్వాత పద్మ విభూషణ్‌ అందుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న రామ్‌ చరణ్‌ రెండు నంది అవార్డులు గెలుచుకున్న విషయం తెలిసిందే. అలాగే సైమా, పాప్‌ గోల్డెన్‌ అవార్డు అందుకున్నారు రామ్ చరణ్. చెర్రీ నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటునాటు పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో గత ఏడాది ఆస్కార్‌ గెలుచుకుంది. చరణ్‌ భార్య ఉపాసన వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా రాణిస్తోంది.

అపోలో ఆస్పత్రిలో కీలక పదవిలో ఉన్న ఉపాసన తను చేస్తున్న సేవలకు గాను గతంలో మహాత్మాగాంధీ అవార్డు అందుకుంది. చిరు అల్లుడు అల్లు అర్జున్‌ గత ఏడాది పుష్ప సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. అతడి కెరీర్‌లో ఐదు నందులతో పాటు అనేక పురస్కారాలు ఉన్నాయి. మెగా ఫ్యామిలీలో ఇప్పటివరకు వీళ్ళు ఈ అవార్డులను గెలుచుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -