AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దారుణమైన పరిస్థితులు.. ఏం జరిగిందంటే?

AP Politics: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. గెలుపు కోసం అన్ని పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలతో దూసుకుపోతున్నాయి. ఇక, అసలే ఏపీ కాబట్టి విమర్శలు ప్రతి విమర్శలు, వ్యక్తిగత దూషణలు చాలా సాదారణం అయిపోయాయి. అయితే, రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులపై కూడా తప్పుడు ప్రచారం తప్పుడు ఆరోపణలు చేయడమే దారుణంగా మారింది.

మెగాస్టార్ చిరంజీవిని కొందరు రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవి కొనాళ్లు తర్వాత కాంగ్రెస్‌లో ఆ పార్టీని విలీనం చేశారు. కాంగ్రెస్‌ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాజకీయాల్లో కొన్ని వర్గాల నాయకుడిగా ఉంటూ మిగిలిన వారితో విమర్శలు ఎదుర్కొన్న చిరంజీవి ప్రస్తుతం సినిమాల్లోకి వచ్చి అందరి వాడు అనిపించుకుంటున్నారు. చాలా సార్లు ఈ రాజకీయాలు తనకు చేతకావని స్వయంగా ఆయనే చెప్పారు. రాజకీయాలు చేయాలంటే ఒకమాట అనడానికైనా, ఒక మాట పడటానికైనా సిద్దంగా ఉండాలని అంటారు. కానీ, అది తనకు చేతకాదని చాలా సార్లు చిరంజీవి చెప్పారు. నిజానికి ప్రస్తుత రాజకీయాలు ఆయనకు చేతకాకే ఎక్కువ రోజులు పార్టీ నడిపించలేకపోయారు. ఆ తర్వాత పాలిటిక్స్ పూర్తిగా ప్యాకప్ చెప్పి చక్కగా సినిమాలు చేసుకుంటున్నారు. కానీ, ఆయనపై ఇప్పుడు బురద చల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైసీపీలో అసంతృప్తి నేతలు ఎక్కువగా జనసేన వైపు చూస్తున్నారు. దానికి కారణం చిరంజీవి అని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. నిజానికి వైసీపీలో అసమ్మతి జ్వాలలకు చిరంజీవికి సంబంధం ఏమైనా ఉందా? పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిట్టింగులను మార్చి కొత్తవారికి టికెట్ ఇవ్వాలని జగన్ కు చిరంజీవి చెప్పారా? అని ప్రశ్నిస్తున్నారు.

 

అసలు చిరంజీవి జనసేన గురించి కూడా మాట్లాడటానికి ఇష్టపడరు. పవన్ కల్యాణ్ ను తన తమ్ముడిగానే చూస్తారు తప్పా.. ఒక రాజకీయ నాయకుడిగా చూడరు. భవిష్యత్ లో రాజకీయాలు చేసే ఉద్దేశ్యం లేదని ఆయన ఎన్నోసార్లు చెప్పారు. ఇక, పవన్ కల్యాణ్ కూడా చిరంజీవిని జనసేనలోకి ఆహ్వానించేది లేదని పలు సందర్భాలలో చెప్పేశారు. కానీ, వైసీపీ నేతలు మాత్రం చిరంజీవిని రాజకీయ ఉచ్చులోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. అందరివాడిని అనిపించుకుంటున్న చిరంజీవి మళ్లీ రాజకీయాల్లో తలదూర్చి కొందరిని వాడిని అనిపించుకోవడానికి రెడీగా లేరు. సినిమాకు పెద్ద దిక్కుగా ఉండాలని చిరంజీవి కోరుకుంటున్నారు. ఇప్పటికే సినిమాలు, రాజకీయాలు చూసిన చిరంజీవి ఏది తనకు గుర్తింపును తీసుకొచ్చిందో? ఏదీ తనకు నెగెటివ్ మార్క్ తీసుకొచ్చిందో అర్థం చేసుకున్నారు. కానీ, వైసీపీ మాత్రం కావాలనే రాజకీయ బురద జల్లే ప్రయత్నం చేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -