Jagan: ఎంపీ టికెట్ల విషయంలో తప్పు మీద తప్పులు చేస్తున్న జగన్.. కానీ?

Jagan: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంపీ టికెట్ల విషయంలో తప్పుల మీద తప్పులు చేస్తున్నారని వైసీపీ నేతలు, వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తుకుంటున్నా కూడా జగన్ ఎవరి మాట వినిపించుకోవడం లేదు. తను అనుకున్నది చేసుకుంటూ వెళుతున్నారు. అందులో భాగంగానే ఒంగోలు ఎంపీగా రోజాను నిలబెట్టాలని జగన్ ఆలోచనకు వచ్చారట. మాగుంట శ్రీనివాసులరెడ్డి విషయంలో ఈగోకు పోతున్న జగన్ ఆయనకు టిక్కెట్ ఇచ్చేది లేదని చెబుతున్నారు. కానీ అక్కడ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది.

 

డబ్బులు పెట్టుకునేందుకు రెడీ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అవకాశం ఇవ్వాలి అనుకున్నా.. బాలినేని సహా అక్కడి నేతలు అందరు మూకుమ్మడి రాజీనామా చేస్తారేమో అని భయపడి ఆగిపోయారు. కొంత మంది రియల్టర్లను ఇతరుల్ని పరిశీలించి చివరికి రోజా అయితే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. నగరి నుంచి మరోసారి పోటీ చేయాలని రోజా అనుకుంటున్నారు. కానీ ఆమెకు టిక్కెట్ ఇచ్చే ఉద్దేశంలో జగన్ లేరు. అందుకే ఆమెకు వ్యతిరేకంగా అసమ్మతి చాలా ఉందని మెల్లగా పార్టీ నేతల్ని బయటకు వచ్చేలా ప్రోత్సహించారు. డబ్బులు ఇచ్చినట్లుగా సొంత పార్టీ కౌన్సెలర్ ఆరోపణలు చేశారు. జడ్పీటీసీలు ఇతర నేతలు రోజాకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తామని చెబుతున్నారు.

ఇదంతా స్క్రిప్ట్ ప్రకారమే తెర ముందుకు వస్తోందని వైసీపీ నేతలకు తెలుసు. ఇప్పుడు రోజాకు ధిక్కరించే అవకాశం లేదు. టిక్కెట్ నిరాకరించినా ఆమెకు మరో చోట ఆప్షన్ లేదు. కానీ నిరాకరిస్తే ఆమె చేసే రచ్చను తట్టుకోవడం జగన్ రెడ్డి, సజ్జల వల్ల కాదు. అందుకే ఏదో ఒక టిక్కెట్ అని ఒంగోలు ఎంపీ టిక్కెట్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు. రోజా ఒప్పుకోకపోవడానికి చాన్స్ లేదు కాబట్టి ఫిక్సయిపోయినట్లే. అయితే చివరి క్షణంలో సౌండ్ పార్టీ వస్తే రోజాకు ఆ టిక్కెట్ కూడా గల్లంతయిపోతుందన్న భయం ఉండనే ఉంటుంది. కాబట్టి ఎటు తిరిగి రోజా ఇప్పుడు జగన్ నిర్ణయానికి తలవంచక తప్పదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -