Chiranjeevi-Jagan: చిరంజీవిపై జగన్ ప్రేమ విషయంలో అసలు లెక్కలివేనా.. ఏమైందంటే?

Chiranjeevi-Jagan: ఇటీవల భారత్ ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ అవార్డులలో భాగంగా పద్మ విభూషణ్ అవార్డులు ఇద్దరి తెలుగు వారికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఒకరు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కాగా మరొక మెగాస్టార్ చిరంజీవి ఇద్దరిని భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది.

 

ఈ విధంగా పద్మ విభూషణ్ అవార్డు రావడంతో వీరిద్దరికీ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఘనంగా సత్కారం చేసిన సంగతి మనకు తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంకయ్య నాయుడుతో పాటు మెగాస్టార్ చిరంజీవిని కూడా సన్మానించారు. ఇలా తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యి వీరికి సన్మాన కార్యక్రమాలు చేయడంతో అందరు చూపు ఏపీ ప్రభుత్వం పైనే ఉంది ఏపీ ప్రభుత్వం కూడా వీరిని సత్కరిస్తుందా లేదా అన్న ఆలోచనలో ఉన్నారు.

ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీరిని సత్కరిస్తారని కాదు స్వయంగా వెంకయ్య నాయుడు చిరంజీవిని కలిసి ఈయన వారిద్దరిని సత్కరిస్తారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయనని సత్కరించబోతున్నారని సమాచారం. వీరిద్దరికీ పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించడంతో సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.

 

ఇప్పుడు నేరుగా వారి ఇంటికి వెళ్లి వారిని సత్కరించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అయితే త్వరలోనే ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలోనే జగన్ ఇలాంటి కార్యక్రమానికి కూడా సిద్ధమయ్యారని సమాచారం. వీరిద్దరూ కూడా తెలుగు రాష్ట్రానికి చెందిన వారే అందుకే ఎన్నికల సమయంలో పార్టీల పరంగా ఆలోచించకుండా ఈయన స్వయంగా చిరంజీవిని కలిసి అలాగే వెంకయ్య నాయుడుని కలిసి సత్కరించబోతున్నారని తెలుస్తుంది. మరి ఎప్పుడు వెళ్తారు ఏంటి అనే విషయాలు మాత్రం సీఎంఓ ఆఫీస్ నుంచి ఎలాంటి ప్రకటనలు కూడా రాలేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -