Avinash: బిడ్డను కోల్పోవడం గురించి అవినాష్ షాకింగ్ కామెంట్స్.. ఏం జరిగిందంటే?

Avinash: ముక్కు అవినాష్ జబర్దస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన నటులలో ఒకడు. తెలుగు బుల్లితెరపై సుదీర్ఘకాలంగా, టాప్ కమెడియన్ లో ఒకటిగా వెలుగొందుతున్నాడు. ఇతను కొంతకాలం క్రితం అనూజ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, ఆమె ప్రెగ్నెంట్ అవ్వడం, చానల్స్ వాళ్ళే ఒక ప్రోగ్రాంలో ఆమెకి సీమంతం చేయటం అంతా ఎంతో ఆనందంగా సాగిపోతున్న సమయంలో అనూష కి డెలివరీ టైం దగ్గర పడటంతో హాస్పిటల్లో ఎడ్మిట్ అయింది.

 

అయితే అక్కడ దురదృష్టం కొద్దీ ఆ బిడ్డని పురిట్లోనే కోల్పోవలసి వచ్చింది. ఇదే విషయాన్ని ముక్కు అవినాష్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. సుదీర్ఘమైన వివరణ ఇస్తూ పోస్ట్ చేశాడు. నేను నా ఆనందాన్నైనా బాధనైనా మీతోనే పంచుకుంటూ వచ్చాను మొదటిసారి నా జీవితంలో జరిగిన ఒక విషాద ఘటన మీతో షేర్ చేసుకుంటున్నాను. మేము అమ్మానాన్న అవ్వాలని ఎన్నో కలలు కన్నాము కానీ ఆ కల నిజం అయ్యే సమయంలో కొన్ని కారణాలవల్ల మా బిడ్డని కోల్పోయాము అని చెప్పుకొచ్చాడు.

అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు, మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనుజ అవినాష్ అని రిక్వెస్ట్ చేశాడు. దీంతో అవినాష్ ను ఎవరు ఏ సందర్భంలోనూ ఈ దుర్ఘటన గురించి ప్రశ్నించలేదు. ఫలితంగా ఈ విషాదం నుంచి అవినాష్ త్వరగానే కోరుకున్నట్లు కనిపిస్తున్నాడు. బిడ్డను కోల్పోయినప్పటికీ అవినాష్ షూటింగ్ లలో పాల్గొంటూనే ఉన్నాడు. తన ప్రొఫెషన్ పై ఉన్న ప్రేమతో అందరినీ నవ్విస్తున్నాడు.

 

ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన బూట్ కట్ బాలరాజు సినిమా ప్రమోషన్స్ లో కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రస్తావన రావటంతో ఇలా చెప్పుకొచ్చాడు అవినాష్ .నేను రిక్వెస్ట్ చేయడంతో చాలామంది త్వరగానే దీన్ని మర్చిపోయారు. కానీ కొందరు సినిమా వాళ్ళు అభిమానులు నన్ను ఓదార్చడం కోసం ఫోన్లు చేశారు. కానీ నాకు ఏం సమాధానం చెప్పాలో తెలియక రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పుకొచ్చాడు. అలాగే ఫ్యూచర్లో మాకు ఇంకా బెస్ట్ రాబోతుందని అనుకుంటున్నాము అని తన ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -