Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఇంతకుమించి అవమానం ఉండదుగా!

Rajinikanth: కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రజనీకాంత్ కు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన గత కొన్ని దశాబ్దాలు ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తున్నారు ఇక రజిని సినిమా విడుదలవుతుంది అంటే అభిమానుల హంగామా మామూలుగా ఉండదు. ఇటీవల కాలంలో ఈయన సినిమాలకు పెద్దగా ఆదరణ కరువైంది దీంతో సూపర్ స్టార్ సినిమాలకు గుడ్ బై చెబుతారేమోనని అందరూ భావించారు.

 

ఇక రజనీకాంత్ ఇటీవల నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమా తర్వాత రజనీకాంత్ లాల్ సలాం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విక్రాంత్ సంతోష్ విష్ణు విశాల్ ప్రధాన పాత్రలలో నటించగా రజనీకాంత్ పాత్రలో నటించారు. ఇలా రజినీకాంత్ అతిథి పాత్రలో నటించిన సినిమా అన్నా కూడా అభిమానులు పెద్ద ఎత్తున ఆదరిస్తారు కానీ ఈ సినిమాకు మాత్రం పెద్దగా ఆదరణ లేదని తెలుస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో లాల్ సలాం విడుదల చేసిన థియేటర్లలో జనాలు లేక షోస్ క్యాన్సిల్ చేశారని తెలుస్తోంది.

 

నేడు లాల్ సలాం సినిమాతో పాటు రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే బెనిఫిట్ షోలకు ప్రేక్షకులు ఎవరు రాకపోవడంతో రద్దు చేశారనే విషయం తెలిసి సూపర్ స్టార్ అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇక ముందుగా టికెట్స్ బుక్ చేసుకున్నటువంటి వారికి కూడా డబ్బును రిఫండ్ చేసి థియేటర్ ఓనర్స్ సారీ చెప్పినట్లు సమాచారం.ఇది తెలిసి రజిని ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -