Sharmila-Roja: షర్మిలపై ఘాటుగా విమర్శలు చేసిన రోజా.. ఏం చెప్పారంటే?

Sharmila-Roja: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై రాష్ట్ర క్రీడలు యువజన శాఖ, పర్యాటక శాఖ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరిన తరువాత వైసీపీ నేతలను వరుసగా టార్గెట్ చేస్తూ ఉండటంతో అధికార పార్టీ కూడా అంతే దీటుగా బదిలిస్తోంది. ఇందులో ముఖ్యంగా ఆర్కే రోజాకు వైఎస్ షర్మిలకు మధ్య మాటలు యుద్ధం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.విశాఖ రైల్వే గ్రౌండ్ లో ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ మరొకసారి షర్మిల మీద రెచ్చిపోయింది రోజా. షర్మిలకు సలహా ఇస్తున్నాను తెలంగాణలో మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా రేవంత్ రెడ్డి సర్కార్ నుంచి మనకి రావాల్సింది 6000 కోట్లు తీసుకురండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో ఏపీకి రావలసిన లక్ష 80 కోట్ల ఆస్తులు రాబట్టండి అంటూ సవాల్ విసిరింది. జగన్మోహన్ రెడ్డిని జైలుపాలు చేసిన పార్టీతో షర్మిల చేతులు కలిపి ఏపీకి అన్యాయం చేస్తున్నారని షర్మిల ని విమర్శించింది.

తెలంగాణలో పోరాటం చేస్తాను అని చెప్పిన షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో ఎందుకు విలీనం చేశారో చెప్పాలి, ఏ లబ్ధి పొందటానికి కాంగ్రెస్ తరపున ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తున్నారో తెలపాలి అని డిమాండ్ చేశారు. తన తండ్రి వైఎస్ఆర్ జీవించి ఉంటే కాంగ్రెస్ పై ఉమ్మి వేసే వారిని తిట్టిన షర్మిల ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఆ పార్టీలో చేరారని నిలదీశారు.

 

రాష్ట్రంలో పర్యటనలు చేస్తూ జగన్ సర్కారుపై షర్మిల చేస్తున్న విమర్శలని రోజా తప్పు పట్టారు. అలాగే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో సీఎం ఫోటోలపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు తీవ్ర స్థాయిలో బదులిచ్చారు రోజా. ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం ఫోటో కాకుండా దిష్టిబొమ్మ చంద్రబాబు ఫోటో పెట్టాలా అంటూ సెటైర్లు వేశారు. దీనిపై షర్మిల ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -