Chiranjeevi: చిరంజీవి గొప్పదనం చెప్పిన యండమూరి.. ఏం జరిగిందంటే?

Chiranjeevi: ఈ మధ్యన ఒక వేదికపై చిరంజీవి మాట్లాడుతూ తన జీవిత చరిత్ర రాసే బాధ్యత యండమూరికి అప్పగిస్తున్నాను అనటంతో అందరూ షాక్ కి గురయ్యారు. అందుకు కారణం అప్పటివరకు వాళ్ళిద్దరి మధ్య గల విభేదాలు. ఒక్కసారిగా అందరూ అసలు వాళ్లు మధ్య విభేదాలు ఏమిటి అని చర్చించడం మొదలుపెట్టారు. అయితే దాని గురించి రీసెంట్ గా ఆ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు యండమూరి.అయితే వివాదం ఎందుకు వచ్చింది అనే విషయం చెప్పలేదు.

 

చిరంజీవి హీరోగా నటించిన సినిమా మంచు పల్లకికి నేను డైలాగ్స్ రాశాను. అప్పటినుంచి మా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది దాదాపు 40 సంవత్సరాలు కలిసే మా ప్రయాణం కొనసాగింది. ఇక విభేదాలు సంగతి కి వస్తే భార్యాభర్తలకు సైతం విభేదాలు వస్తూ ఉంటాయి. అలాంటివే మావి కూడా ఆ తరువాత కలిసిపోతూ ఉంటాము. నాలుగేళ్ల తర్వాత చిరంజీవి ఎలా రిసీవ్ చేసుకుంటాడో ఏమో అని కాస్త భయపడ్డాను.

కానీ ఆయన కళ్ళలో అదే ప్రేమ కనిపించింది. ఆ రోజున వేదికపై మీ జీవిత చరిత్ర రాస్తే బాగుంటుందేమో అని నేనే అడిగాను. ఆయన ఆనందాశ్చర్యాలకు లోనవుతూ నిజంగా రాస్తావా.. నువ్వు రాస్తే అంతకంటే కావాల్సిందేముంది, ఈ స్టేజిపై అనౌన్స్ చేయమంటావా అని అడిగారు. నేను సరే అనటంతో అదే స్టేజిపై జీవిత చరిత్ర గురించి అనౌన్స్ చేశారు. ఇప్పుడు మా మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు అని వివరణ ఇచ్చారు యండమూరి.

 

నిజానికి మెగాస్టార్ చిరంజీవి ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్ర మధ్య అప్పట్లో విభేదాలు ఒక రేంజ్ లో ఉండేవి. ఒక సందర్భంలో మెగా బ్రదర్ నాగబాబు యండమూరి పై పేరు చెప్పకుండానే నిప్పులు చెరిగారు. పబ్లిక్ గానే ఈ సన్నివేశం చోటు చేసుకుంది. అప్పట్లో తీవ్ర సంచలనానికి తెరతీసింది ఈ సంఘటన. కొసమెరుపు ఏమిటంటే చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదుని అందించింది యండమూరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -