Saindhav: ఆ మార్పులు చేర్పులు చేసి ఉంటే మాత్రం సైంధవ్ రిజల్ట్ మారేదా?

Saindhav: వెంకటేష్ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం సైంధవ్. తండ్రి కూతురి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఒక యాక్షన్ మూవీగా కూతురు సెంటిమెంట్ తో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేక పోయిందని చెప్పాలి.

 

ఇక ఈ సినిమా గురించి తాజాగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన విశ్లేషణ ఇచ్చారు.ఈ సినిమా గురించి పరుచూరి మాట్లాడుతూ.. ఈ సినిమాలోని పాత్రల ఎంపిక విషయంలో దర్శకులు కాస్త జాగ్రత్త తీసుకొని ఉండాల్సిందని ఈయన తెలిపారు. ఇలాంటి సినిమా చేస్తే విజయం సాధిస్తుందా లేదా అనేది శ్రద్ధ పెట్టాలి ముఖ్యంగా హీరో ఈ విషయం గురించి ఆలోచించాల్సి ఉండేదని ఈయన తెలిపారు.

ఈ సినిమా మార్పుల గురించి నన్ను అడిగితే నేనైతే ఈ సినిమా క్లైమాక్స్ మొత్తం మార్చేసేవాడినని పరచూరి తెలిపారు. మన ప్రేక్షకులు ఎక్కువగా మన తెలుగు వారికి ప్రాధాన్యత ఇస్తారు. వేరే భాష నటులు నటిస్తున్నప్పుడు పూర్తి బాధ్యత వారిపై వేయకూడదని ఈయన తెలిపారు. తన కూతురిని బ్రతికించుకోవడం కోసమే తండ్రి పడే ఆరాటమే ఈ సినిమా కథ మరి పాప బతికిందా లేదా అన్న విషయంపై సినిమా ఫలితం ఆధారపడి ఉంది.

 

హీరోయిన్ పాత్ర విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సి ఉండేదని ఆమెకు పెళ్లయినట్టు చూపించకపోయినా బాగుండేది కానీ పెళ్లయి ఒకరి భార్య మరొకరి దగ్గర ఉండటాన్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు వీరిద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలను కూడా పెద్దగా పండించలేకపోయారు. స్క్రీన్ ప్లే డైలాగులు కూడా పెద్దగా లేవు. డ్రగ్స్ మాఫియాని ఎదుర్కోవడం వంటి సీన్లు వెంకటేష్ కి ఏమాత్రం తగవని పరుచూరి తెలిపారు.

 

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -