CM Jagan: నేతిబీరకాయలో నెయ్యిలా సీఎం జగన్ న్యాయం.. ఏమైందంటే?

CM Jagan: మరి కొద్ది రోజులలో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో అధికార పార్టీ నేతలే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. స్థానిక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జగన్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్సిపి పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి జగన్ ప్రభుత్వం పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో సంచలనంగా మారాయి.

 

వైసీపీ పార్టీలో సామాజిక న్యాయం అనేది నేతి బీరకాలో నెయ్యి లాంటిదని ఈయన ఏద్దేవా చేశారు. వైఎస్ఆర్సిపి పార్టీలో బీసీలకు పదవులు ఇచ్చారు కానీ అధికారాలు ఇవ్వలేదని ఈయన తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే పరిస్థితి పార్టీలో లేదని తెలిపారు. కీలక పదవులన్నీ ఓకే సామాజిక వర్గం చేతిలో ఉన్నాయని కృష్ణమూర్తి ఆరోపణలు చేశారు.

 

బీసీ వర్గానికి చెందిన వారందరూ కూడా వైకాపాకు దూరం అవుతున్నారని తెలిపారు. బీసీలకు ప్రోటోకాల్ పాటించట్లేదని బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈయన తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నా బీసీలు నా ఎస్సీలు ఎస్టీలు అంటారు. ఇవన్నీ వట్టి మాటలే కానీ బీసీ ఎస్సీ ఎస్టీల మనోగతాలను ఆయన అర్థం చేసుకోలేదని తెలిపారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నారు అంటూ విమర్శలు చేశారు. ఇలా సొంత పార్టీ నేతల నుంచి పార్టీ పట్ల వ్యతిరేకత రావడంతో పలువురు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -