Chiranjeevi: ఆ లెక్క ప్రకారం చిరంజీవే టాపు, తోపు.. కానీ?

Chiranjeevi: తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి స్వయంకృషితో వచ్చి తన టాలెంట్ తో నెంబర్ వన్ హీరోగా ఎదిగిన చిరంజీవి ఎంతోమందికి ఇన్స్పిరేషన్. నేటి నటులు చాలామంది తమకి ఇన్స్పిరేషన్ చిరంజీవి అని అతని స్పూర్తితోనే సినిమాల్లోకి వచ్చాము అని చెప్పటం గమనార్హం. నాలుగు దశాబ్దానికి పైగా తనదైన చిత్రాలతో ఆలరించిన చిరంజీవి ఇప్పుడు తన 156 వ సినిమాగా విశ్వంభర తో మన ముందుకి వస్తున్నారు. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

 

ఈ సినిమా 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.విశ్వంభర సినిమాకు భారీ రేంజ్ లో ఖర్చు అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు థియేటర్ హక్కుల రూపంలోనే 230 నుంచి 250 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగే అవకాశం ఉంది. భారీ బడ్జెట్ సినిమాలకు ఈ రేంజ్ లో బిజినెస్ జరిగితే కనీసం 300 కోట్ల రూపాయలు షేర్ కలక్షన్ వస్తే మాత్రమే చిరంజీవి అరుదైన రికార్డు సాధించిన ఘనత దక్కుతుంది.

మరి చిరంజీవి ఆ రికార్డుని సొంతం చేసుకుంటారు లేదో వేచి చూడాల్సిందే. అయితే చిరంజీవి కెరియర్ లో ఫ్లాప్ ఇచ్చిన ప్రతిసారి మళ్లీ హిట్ అందుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ సునామీలు సృష్టించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చిరంజీవి ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటి ఇతర భాషల్లో కూడా మార్కెట్ పెంచుకుంటారేమో అని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

 

తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న రాంచరణ్ సినిమాలకి పోటీగా వెళుతున్నాడు చిరంజీవి. వయసు అయిపోయినా నేనేమీ తీసిపోలేదు అంటూ చిరంజీవి రాబోయే సినిమాలన్నీ భారీ లెవెల్ లోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.ఇంచుమించు కొడుకుతో బడ్జెట్ విషయంలో సమానంగా ఉన్నారు. ఇక విశ్వంభర సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -