TS DSC Notification 2024: తెలంగాణ రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్.. నిరుద్యోగుల కష్టాలు తీరినట్టేనా?

TS DSC Notification 2024: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను తెలియజేసింది.గత కొంతకాలంగా ఏ విధమైనటువంటి ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయితే నిరుద్యోగుల అవస్థలను గుర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నిరుద్యోగ రహిత రాష్ట్రంగా మారుస్తామంటూ హామీలు ఇచ్చారు.

ఈ విధంగా గత ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి నిరుద్యోగులు ఓటుతో బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు శుభవార్తను తెలియజేస్తూ మెగా డీఎస్సీ విడుదల చేశారు. ఈ క్రమంలోనే గురువారం విద్యాశాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రితో పాటు మంత్రి కోమటిరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రేవంత్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి 11,062 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. గత ప్రభుత్వం సెప్టెంబర్లో 5,089 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ఈ నోటిఫికేషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తూ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఇదివరకే దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ప్రస్తుతం నోటిఫికేషన్లు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. గత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో సుమారు 1.77 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గత ప్రభుత్వం విడుదల చేసిన 5,089 పోస్టులకు మరో 5,973 పోస్టులను కలిపి మొత్తం 11062 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -