Jagan: 23 వేల పోస్టులు ఉన్నాయని చెప్పి ఇన్ని తక్కువ పోస్టులా జగన్?

Jagan: గత నాలుగున్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పటికీ ఒకసారి కూడా డిఎస్సి నోటిఫికేషన్ నిర్వహించలేదు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర్లో ఉండగా ఇదిగో డీఎస్సీ నోటిఫికేషన్ అంటుంది జగన్ సర్కార్. అదికూడా 6,100 పోస్టులు మాత్రమే. ఇదే మెగా డీఎస్సీ ఆ, పైగా అప్రెంటిస్ షిప్ విధానాన్ని తెచ్చారు. జగన్ నిజానికి నిరుద్యోగులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారని చెప్పవచ్చు. డీఎస్సీ ఇవ్వాలని కోరితే వెట్టి చాకిరీ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఎప్పుడో 12 ఏళ్ల క్రితం రద్దు చేసిన అప్రెంటిస్ షిప్ విధానాన్ని మళ్లీ తీసుకొచ్చారు.

 

రెండేళ్ల పాటు తక్కువ జీతాలకు పని చేయాల్సిందే అంటున్నారు. డీఎస్సీలో 6,100 పోస్టులు అప్రెంటిస్ షిప్ విధానాన్ని పునరుద్ధరిస్తూ బుధవారం మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం హయాంలో 2018 లో డీఎస్సీ ఇస్తే నాలుగున్నర ఏళ్ళు ఏం గాడిదలు కాసారని చంద్రబాబుని విమర్శించారు జగన్. ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ ఏ గాడిదలు కాసారని నిరుద్యోగుల ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో 7,902 పోస్టుల భర్తీకి ప్రకటన ఇస్తే అంతేనా అంటూ ఎగతాళిగా మాట్లాడారు. ఇప్పుడు వాటికంటే కూడా 1,802 పోస్టులని తగ్గించేశారు.

ప్రస్తుతం లెక్కల ప్రకారం చూసుకుంటే 18,520 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవి కాకుండా ఆదర్శ పాఠశాలలు, గిరిజన, సాంఘిక,బీసీ సంక్షేమ పాఠశాలలు కలిపితే ఈ ఖాళీలు 28 వేలకు పైనే ఉంటాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మండల జిల్లా పరిషత్తు, పురపాలక పాఠశాలల్లోనే 8,366 పోస్టులు అవసరం కానున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ శాసనమండలిలో ప్రకటించారు. పాఠశాల విద్యలో ఎనిమిది వేల ఖాళీలు ఉంటే 2000 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. స్వచ్ఛంద పదవీ విరమణలు కరోనాతో మరణాల వల్ల ఏర్పడిన ఖాళీలే 2000 దాకా ఉన్నాయి.

 

డీఎస్సీ ప్రకటనకు పరీక్ష నిర్వహణకు మధ్య 40 రోజుల సమయం ఉండాలి. కంప్యూటర్ ఆధారత పరీక్ష నిర్వహిస్తున్నందున పరీక్షలకు 15 రోజులు సమయం పడుతుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసేటప్పటికీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుంది ఆ తర్వాత ఈ పరీక్షల నిర్వహణ నిలిచిపోతుంది. అంటే ఎన్నికల ముందు నిరుద్యోగులను మోసగించేందుకే ఈ డీఎస్సీ ప్రకటన అంటూ గగ్గోలు పెడుతున్నారు వివరం తెలిసినవారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -