Jagan: ఐదేళ్ల పాలనలో నిరుద్యోగులను నిండా ముంచిన జగన్.. ఏమైందంటే?

Jagan: బాబు వస్తే జాబు వస్తుంది అన్నారు.. బాబు వచ్చారు.. జాబు వచ్చిందా అక్కా? జాబు వచ్చిందా చెల్లి? అంటూ నేటి సీఎం జగన్ గత ఎన్నికల ముందు ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ తర్వాత రావాలి జగన్ అంటూ పాటలు పాడించారు. జగన్ అయితే వచ్చారు. కానీ.. బాబు లేదు.. జాబ్ నోటిపికేషన్ లేదు.. జాబు క్యాలెండర్ కూడా ఉందో లేదో తెలియదు. గత ఎన్నికల ముందు యువతనే టార్గెట్ చేస్తూ చాలా గట్టిగా ప్రచారం చేసింది వైసీపీ. ఊరూరా తిరుగుతూ యువతతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా వస్తే కలిగే ప్రయోజనాల గురించి చెప్పడంతో పాటు.. ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ అన్నారు. ఇప్పటి వరకూ కనీసం ఒక్క మినీ డీఎస్సీ కూడా లేదు. చివరికి చంద్రబాబు హయాంలో వేసిన డీఎస్సీని కూడా ఆపేశారు. దీంతో, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరిగింది. విద్యార్థులు కూడా నాణ్యమైన విద్యకు దూరమైయ్యారు.

 

డీఎస్సీ సంగతి అటుంచితే.. ప్రతీ ఏడాది 6500 వందల పోలీస్ నియామకాలు పడతామని చెప్పారు. ప్రతీ సంవత్సరం జనవరిలో నోటిఫికేషన్ ఉంటుందని అన్నారు. ఈ ప్రకటన రావడం.. అదే సమయంలో కరోనా మహమ్మారి రావడంతో.. సిటీల్లో చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకున్న వారు కూడా ఊరికి వచ్చి కానిస్టేబుల్, ఎస్సై నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అయ్యారు. ఏడాదికో నోటిఫికేషన్ సంగతి పక్కన పెడితే.. ఐదేళ్లకు ఒక్కసారి కూడా నియామకాలు జరపలేదు. పాపానికి ఒక్కసారి విడుదలైన నోటిఫికేషన్ పై పలు ఆరోపణలతో కేసు నమోదైంది. ఈ వివాదం ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. దీంతో.. నమ్మకం లేక.. మళ్లీ యువత లగేజ్ సర్దుకొని హైద్రాబాద్, బెంగళూరు బాటపట్టారు.

గ్రూప్స్ ఉద్యోగాల విషయానికి వస్తే.. ఈ పేరు చెప్పి పెద్ద డ్రామానే నడిపించింది వైసీపీ ప్రభుత్వం. ఓ సారి సింగిల్ డిజిట్ గ్రూప్ ఉద్యోగాలతో ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సర్కార్. నిరుద్యోగులు అప్లైయ్ చేసుకోవడానికి కూడా సహరించలేని అంత అందంగా సైట్ ను ఆర్గనైజ్ చేశారు. దీంతో.. ఆ నోటిఫికేషన్ ఏమైందో ఎవరికీ తెలియదు.

 

ఇక వైసీపీ సర్కార్ మాత్రం లక్షల ఉద్యోగాలు తీశామని గొప్పలు చెప్పుకుంటోంది. మరి ఆ ఉద్యోగాలు ఏంటీ అంటే.. వాలంటీర్లు. అయితే, అది ఉద్యోగమని ఓసారి. సమాజ సేవ అని మరోసారి వైసీపీ నేతలే చెబుతారు. అది ఏంటీ అనేది వారికైనా క్లారిటీ ఉందో లేదో తెలియదు. ఉద్యోగమా? సేవ పక్కన పెడితే.. డిగ్రీ చేసిన వారికి కూడా 5 వేల రూపాయలు ఇచ్చి.. ఇదే ఉపాధి అంటే వాళ్లు ఎలా బతుకుతారు? దాన్ని ఉపాధి కల్పించడం అంటారా? వంచించడం అంటారా? ఇక, దాని తర్వాత సచివాలయ ఉద్యోగులు.. వారు వాలంటీర్లకు ఎక్కువ.. జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్‌‌కు తక్కువగా అన్నట్టు మార్చేశారు. వారి జీవితాల్లో కూడా ఓ ఎదుగు బొదుగు లేకుండా చేశారు.

 

ఐదేళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి యువతకు చెప్పింది ఏంటీ? ఐదేళ్లలో యువతకు చేసింది ఏంటీ? అని చూస్తే రెండింటికి అసలు పొంతనే లేకుండా ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -