God Father: ఆ సినిమాను లైట్ తీసుకుంటున్న చిరంజీవి.. కారణం ఏంటంటే?

God Father: ప్రస్తుతం చిరంజీవి టాలీవుడ్లో అగ్రస్టార్ హీరోగా వెలుగుతున్నాడు. కుర్ర హీరోలతో సమానంగా సినిమా అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నాడు. చిరంజీవి ఇటీవల విడుదలైన ఆచార్య సినిమా పూర్తిగా డిజాస్టర్ పాలయింది. తర్వాత ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా గాడ్ ఫాదర్. కాగా ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది.

మలయాళం లో వచ్చిన లూసీఫర్ సినిమాను తెలుగు రీమేక్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక మరో రెండు వారాలు విడుదల కాబోతున్న ఈ సినిమాకు హడావిడి ఏం కనిపించడం లేదు. ప్రమోషన్లు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. సినీ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా గురించి అంత బజ్ ఏమీ కనిపించడం లేదు. దీంతో చిరంజీవి అభిమానులు అయోమయం అవుతున్నారు. ఆచార్య తర్వాత ఈ సినిమా చిరంజీవికి తప్పకుండా హిట్టు అందించాల్సి ఉంది.

కానీ ఈ సినిమా గురించి ఈ చిత్ర బృందం ప్రమోషన్ల నేపథ్యంలో అంతగా ఏం రాణించడం లేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో చిరంజీవికి ఏమాత్రం సాటిస్ఫాక్షన్ లేదని సినీ ఇండస్ట్రీలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దీని కారణంగానే చిరు ప్రమోషన్ ల విషయంలో లైట్ తీసుకున్నారని కొన్ని వాదనలు వస్తున్నాయి. ఇక విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా టీజర్, థార్ మార్ సాంగ్ లు ప్రేక్షకులను అంతగా ఏమీ ఆకట్టుకోలేదు. ఇక బాలీవుడ్ అగ్రస్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో నటిస్తున్నప్పటికీ ఈ సినిమాకి అంత హైప్ రాలేదు.

దీంతో ఈ సినిమా విషయంలో సినీ ఇండస్ట్రీ సైతం చాలా వరకు ఆశ్చర్య పోతుంది. ఇక మొదట ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా విడుదల చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతం ఈ సినిమాను తెలుగులో మాత్రమే విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్నందున పంపిణీదారులు, ప్రదర్శనదారులు ఈ సినిమాలో బాలీవుడ్ లో కూడా విడుదల చేయమని సలహా ఇచ్చారట. కానీ దీనికి చిరంజీవి ఒప్పుకోలేదట. మొదట తెలుగులో విజయం సాధిస్తే ఆ తర్వాత చూద్దామని చిరంజీవి అన్నట్లు కొన్ని వార్తలు జరుగుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -