Narsapuram: రఘురామను కాదని శ్రీనివాసవర్మకు టికెట్.. నరసాపురం టికెట్ దక్కించుకున్న ఈ వ్యక్తి ఎవరంటే?

Narsapuram: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీ నేతలు అభ్యర్థులను ప్రకటిస్తూ ఎన్నికల బరిలోకి దిబ్బ పోతున్నారు అయితే తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఎన్నికలు త్వరలోనే రాబోతున్నటువంటి తరుణంలో బిజెపి పొత్తులో భాగంగా ఇటీవల అభ్యర్థులను ప్రకటించారు. ఈ క్రమంలోనే నరసాపురం ఎంపీగా ప్రస్తుతం ఉన్నటువంటి రఘురామకృష్ణం రాజుకే టికెట్ వస్తుందని అందరూ భావించారు.

ఇలా రఘురామకృష్ణం రాజు కూడా కూటమిలో భాగంగా తను ఏ పార్టీ నుంచి అయినా పోటీ చేయడానికి సిద్ధమేనని ధీమా వ్యక్తం చేశారు. అయితే బిజెపి పెద్దలు మాత్రం ఈయనకు ఊహించని విధంగా షాక్ ఇచ్చారని చెప్పాలి. నరసాపురం ఎంపీ టికెట్ పై ఆశ పెట్టుకున్నటువంటి రఘురామకృష్ణం రాజు ఆశలు కాస్త అడియాశలుగా మిగిలిపోయాయి. ఈ నరసాపురం ఎంపీ స్థానాన్ని రఘురామకృష్ణం రాజుకు బదులుగా భూపతిరాజు శ్రీనివాసవర్మను ఎంపిక చేశారు.

ఇలా శ్రీనివాస వర్మ అనే వ్యక్తికి టికెట్ ఇవ్వడంతో ఒకసారి గా షాక్ అయినటువంటి కృష్ణంరాజు వర్గీయులు అసలు ఈ శ్రీనివాస వర్మ ఎవరు రఘురామకృష్ణం రాజులు కాదని ఈయనకు టికెట్ ఇవ్వడానికి గల కారణం ఏంటి అనే విషయాల గురించి చర్చించుకుంటున్నారు. సాధారణ కార్యకర్త నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగిన శ్రీనివాసవర్మకు చాన్స్‌ ఇచ్చారు. సాధారణ కార్యకర్త గుర్తింపుకు ఇదే నిదర్శనమని, అందరిని కలుపుకుని పోవడం వల్ల కచ్చితంగా ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందడం ఖాయం అని బిజెపి భావించారు.

ఇలా శ్రీనివాస వర్మ కు టికెట్ ఇవ్వడంతో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షాలతో పాటు పురందేశ్వరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. మరోవైపు రఘురామకృష్ణం రాజు తనకు టికెట్ రాకుండా జగన్ తెర వెనుక కుట్ర చేశారని అందుకే తనకు టికెట్ రాలేదని మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా తనకు టికెట్ రాకపోయినా జగన్ ఓటమికి తాను కృషి చేస్తానంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -