Sleep: రోజు నిద్ర లేవగానే కచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఇవే..!

Sleep:  ఈ మధ్య కాలంలో ఉదయం లేవగానే చాలామంది ఫోన్లు పట్టుకుని కూర్చుంటున్నారు. అలాగే నిద్ర లేవగానే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు సెల్ ఫోన్ లో గేమ్స్ అని ఏదో ఒక వంకతో మొబైల్ ఫోన్లో చూస్తూ ఉంటారు. నిజానికి నిద్ర లేవగానే పాటించాల్సిన నియమాలు పాటించరు.

దీంతో వాళ్లు అనారోగ్యానికి తరచూ గురవుతుంటారు. దీనికి ముఖ్య కారణం ఏంటా అని వైద్యుల దగ్గరికి వెళుతూ ఉంటారు. కానీ మనం పాటించాల్సిన నియమాలు పాటిస్తే వైద్యుల వద్దకు వెళ్లే అవసరం ఉండదు. అందుకే ఉదయం నిద్రలేవగానే ఫోన్‌ ఉపయోగించకూడదు.

రోజుని ఎంత ఉషారుగా మొదలు పెడితే అంత మంచిది. ఫలితాలు అంత విజయవంతంగా ఉంటాయి. ఇక ఉదయం నిద్రలేచిన తర్వాత ఏఏ పనులు నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. నిద్రలేచిన వెంటనే రెండు గ్లాసుల నీళ్లు తాగాలి. ఇది మీరు రోజంతా ఉత్సాహంగా ఉండడానికి, ఆరోగ్యంగా పని చేయడానికి ఉపయోగపడుతుంది.

అందుకే మీరు ఎక్కడికి వెళ్లినా వాటర్‌ బాటిల్‌ ను తీసుకొని వెళ్ళాలి. ఓ మైలు దూరం వరకూ జాగింగ్‌ చెయ్యాలి. దీంతో మీ కండరాలకు శక్తి చేరి శరీరం ఫిట్‌గా ఉంటుంది. అదే విధంగా మెదడు చురుగ్గా పని చేస్తుంది. అలాగే తరచూ యోగా చెయ్యాలి. ఇలా చెయ్యడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

వైరస్‌ల బారిన పడకుండా ఉండేందుకు ఆవిరి పట్టాలి. దీంతో ఊపిరి సులువుగా తీసుకోవచ్చు. అలాగే ఆవిరి పట్టడం చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆ తర్వాత ఆరోజు చేయాల్సిన పనులన్నిటినీ డైరీలో రాసుకోవాలి. దీని వల్ల మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అల్పాహారం తప్పని సరిగా చెయ్యాలి. సమయానికి ఆహారం తీసుకోవాలి.

సరైన సమయానికి ఆహారం తీసుకున్నపుడే పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయగలరు. ఆత్మవిశ్వాసంతో మొదలు పెట్టే పని ఏదైనా మంచి ఫలితాన్ని దక్కిస్తుంది. మీ రోజుని ఆనందంతో, విశ్వాసంతో ప్రారంభిస్తే ఇక విజయం తప్పక మీ సొంతమవుతుంది. అందుకే నిద్ర లేవగానే చిరునవ్వుతో లేస్తే ఆ రోజంతా మీరు ఆనందంగా ఉంటారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -