YS Jagan-Bharathi: ఉగాది పూజ‌ల్లో తొలిసారి భార‌తి.. ఎన్నికల ఎఫెక్ట్ తో ఆమె అభిప్రాయం మారిందా?

YS Jagan-Bharathi: ఉగాది పండుగను పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలందరూ కూడా ఈ ఉగాది పండుగ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా ఉగాది పండుగ వేడుకలను జరుపుకున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ప్ర‌చారంలో ఉన్న సీఎం జ‌గ‌న్ ఉమ్మ‌డి గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంపులో విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఇక ఇక్కడ ఈయన ఉగాది పండుగ వేడుకలను కూడా జరుపుకున్నారు. ఉగాది పండుగ వేడుకలలో భాగంగా జగన్మోహన్ రెడ్డి సతీసమేతంగా పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఎప్పుడు లేని విధంగా ఈ పూజ వేడుకలలో వైయస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతి పాల్గొనడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

సాధారణంగా వైఎస్ భారతి ఎలాంటి గుల్లకు గోపురాలకు బయటకురారు ఆమె ప్రసాదాలను కూడా తీసుకోరు. కానీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి తన భార్యతో కలిసి హిందూ సంప్రదాయ వేడుకలలో భాగంగా వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకొని ఓ ఉగాది పండుగ వేడుకలను జరుపుకున్నారు. హిందూ మత పెద్దలు ఆశీర్వాదాలు తీసుకున్నారు. తలపై అక్షింతలు వేయించుకొని పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

వేద పండితులు ఆశీర్వాదంతో వైయస్ భారతికి దేవుడి పట్టు వస్త్రాలను సమర్పించారు అలాగే ఇద్దరికీ ఒకే శాలువా కప్పి తలపై అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఇక పూజ కార్యక్రమాలు అనంతరం ఉగాది పచ్చడిని కూడా ప్రసాదంగా ఇవ్వడంతో ఈ ఇద్దరూ ఉగాది పచ్చడి కూడా తీసుకోవడం కోసం ఇలా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఇలా పూజా కార్యక్రమాలలో తొలిసారి భారతి కనిపించడంతో ఓట్ల కోసమే ఈ డ్రామాలన్ని అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -