Mohammed Iqbal: టీడీపీలో చేరిన వైసీపీ నేత.. హిందూపురంలో పార్టీ బలం మరింత పుంజుకుందా?

Mohammed Iqbal: ఏపీ ఎన్నికలు మే 13 వ తేది జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున నాయకులు ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి చేరుతున్నారు. ఈ క్రమంలోనే అనంతపురంలో కీలక నేతగా ఉన్నటువంటి వైసీపీ నాయకుడు టిడిపి చెంతకు చేరారు. దీంతో హిందూపురం పార్టీలో మరింత టిడిపి పుంజుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అనంతపురం జిల్లా హిందూపురం వైసీపీ ఇంచార్జి, ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.

ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి ఇక్బాల్ గతంలో చంద్రబాబుకు చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ గానూ పనిచేశారు. అనంతరం టీడీపీలో చేరారు. మళ్లీ కొన్నేళ్ల తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా సంవత్సరంలో వైసీపీలోకి వచ్చి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం 2019వ సంవత్సరంలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పై పోటీకి దిగి ఓటమి పాలయ్యారు. అప్పటినుంచి ఈయన పార్టీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు.

ఇకపోతే ఈ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ఈయనకు టికెట్ ఇవ్వకపోవడంతో చాలా నిరాశ వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇక్బాల్ వైసీపీ పార్టీకి గట్టి షాక్ ఇస్తూ చంద్రబాబునాయుడు సమక్షంలో తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు.టీడీపీ అధినేత ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా ఇప్పటికే వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ఇక్బాల్‌ ఆ లేఖలను సీఎం జగన్, మండలి చైర్మన్‌ కు పంపారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -