Kia – Tesla: కియాను పంపించే జగన్ టెస్లా తెస్తానంటే నమ్మాలా.. ఇది మరీ విడ్డూరం అంటూ?

Kia – Tesla: ఆంధ్రప్రదేశ్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సంక్షేమ పథకాలపైనే ఫోకస్ పెట్టారే తప్ప రాష్ట్ర అభివృద్ధిపై ఏ మాత్రం ఈయన ఫోకస్ పెట్టలేదని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసారు అంతేకాకుండా ఇప్పటివరకు పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారు తప్ప ఎక్కడ కూడా కొత్త కంపెనీలు ప్రారంభం చేయలేదు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు.

ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కంపెనీలు ఇక్కడికి రాగా జగన్మోహన్ రెడ్డి వాటిని పక్క రాష్ట్రానికి పంపించారు జాకీతో పాటు అమర్ రాజా బ్యాటరీ కంపెనీ కూడా ఇక్కడ తమ కంపెనీలను ప్రారంభించాలని రావడంతో జగన్మోహన్ రెడ్డి వాటిని తిరస్కరించగా తెలంగాణకు వెళ్లిపోయాయి.. ఇక చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన కియా పరిశ్రమను కూడా జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు తిరస్కరించారు.

ఈ విధానాలు జగన్మోహన్ రెడ్డికి నచ్చకపోవడంతో తాము అధికారంలోకి వస్తే కియా ని తిరిగి పంపేస్తామంటూ కూడా ఈయన గతంలో చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలాంటి తరుణంలోనే ఎన్నికల వేళ రాష్ట్రంలో అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా ఏపీలో యూనిట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు స్థల పరిశీలన కోసం ఓ టీంను పంపాలని ఏపీ సర్కార్ కోరినట్లుగా కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇక ఈ వ్యాఖ్యలపై పలువురు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వెనక్కి పంపిస్తామని వార్నింగ్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి స్వయాన తెలుగు అమర్ రాజా బ్యాటరీ కంపెనీని కూడా తెలంగాణకు పంపించినటువంటి ఈయన అంతర్జాతీయ కంపెనీని తీసుకువస్తారని చెబితే నమ్మడం సాధ్యమేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -