Black Magic Near KCR House: కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు.. టార్గెట్ చేయడం వెనుక కారణాలు ఇవేనా?

Black Magic Near KCR House: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి సమీపంలో జరిగిన క్షుద్ర పూజలు ఇప్పుడు కలకలాన్ని రేపుతున్నాయి. కేసీఆర్ బంజారాహిల్స్ లోని నంది నగర్ లో తన సొంత ఇంటిలో నివాసం ఉంటున్నారు,ఆ ఇంటిని అనుకుని ఉన్న ఒక ఖాళీ స్థలంలో ఈ క్షుద్ర పూజలు జరిగినట్లు తెలుస్తోంది. ఆ ప్రదేశంలో ఎర్రబట్ట, పసుపు, కుంకుమ అనవాళ్లు కనిపించాయి అంతేకాదు అక్కడ ఒక బొమ్మ దానిపై పసుపు, కుంకుమ కూడా చల్లి ఉన్నాయి.

ఈ క్షుద్ర పూజలు నిన్న అర్ధరాత్రి చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఈ కేసుని విచారిస్తున్నారు. ఎవరు ఈ పూజలు చేశారు? దీని వెనక ఎవరి హస్తం ఉంది, రాజకీయ దురుద్దేశంతోనే ఈ క్షుద్ర పూజలకు పాల్పడ్డారా అనే విషయాలపై జోరుగా చర్చ జరుగుతుంది. కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్ర పూజలకు వేదికగా చేసుకోవడం సంచలనంగా మారింది.అయితే ఈ విషయంపై ఇప్పటివరకు కేసీఆర్ ఫ్యామిలీ స్పందించలేదు.

ఈ రోబోటిక్ యుగంలో సాంకేతికంగా అభివృద్ధి ఒకవైపు కనిపిస్తుంటే మరొకవైపు మాత్రం ఈ క్షుద్ర పూజలు, చేతబడి, మూఢనమ్మకాలు కనిపించడం నిజంగా విచారకరం. ఇలాంటి పూజలు పలానచోట జరిగాయి అంటూ ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ పూజలు మాజీ సీఎం కేసీఆర్ ఇంటి పక్కనే జరగటంతో తీవ్ర ఉత్కంఠత ఏర్పడింది. అసలే తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలలో అధికారం కోల్పోవడం..

పార్టీ నుంచి కీలక నేతలంతా ఒక్కొక్కరు పార్టీని వీడటం అలాగే కవిత అరెస్టు వంటి అంశాలు జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఇంటి సమీపంలో క్షుద్ర పూజల ఘటన చోటు చేసుకోవటం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల్లో చర్చనీయాంశమైంది. వరుస నష్టాల నుంచి బయటపడేందుకు పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో తాజాగా కేసీఆర్ వాస్తు మార్పులు చేయించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలోనే కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్ర పూజలు జరగటం తీవ్ర సంచలనంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -